పిడుగుపాటుకు ఒకరు మృతి,ముగ్గురికి గాయాలు

నల్గొండ జిల్లా:దామరచర్ల మండలం( Damercherla ) వీర్లపాలెం గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడి ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.

వీర్లపాలెం గ్రామంలో మహిళా కూలీలు మిరప తోటలో కలుపు తీస్తుండగా వర్షంతో పాటుగా పిడుగు పడటంతో పాతులోతు హానిమి(38)అక్కడికక్కడే మృతి చెందగా,మరో ముగ్గురుకి గాయాలయ్యాయి.వారిని వెంటనే మెరుగైన వైద్యం కోసం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

Latest Nalgonda News