కుక్కని ఉద్యోగంలో చేర్చుకున్న ఓలా సీఈవో.. దాని జాబ్ ఏంటో తెలిస్తే...

సాధారణంగా కంపెనీలు మనుషులకే జాబ్‌లు ఇస్తుంటాయి.జంతువులకు ఐడీ కార్డులు ఇచ్చి మరీ ఏ కంపెనీ నియమించుకోదు.

 Ola Electric Welcome New Employee A Dog Bijlee Details, Ola, Bijlee Dog, Bhavis-TeluguStop.com

ఆర్మీ కుక్కలను( Dogs ) తీసుకుంటారేమో కానీ వాటికి ఐడీ కార్డు వంటివి ఏమీ ఉండవు.కానీ బెంగళూరులోని ఒక కంపెనీ కుక్కని నియమించుకొని అధికారికంగా దానికి ఒక ఐడీ కార్డు కూడా ఇచ్చింది.

ఇది తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.కాళ్లు అరిగేలా తిరిగినా ఒక్క జాబు కూడా దొరకడం లేదు కానీ నీకు భలేగా జాబ్ దొరికేసిందిగా అంటూ నిరుద్యోగులు సరదాగా కామెంట్లు కూడా పెడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే ప్రముఖ రైడ్-హెయిలింగ్ కంపెనీ అయిన ఓలా( Ola ) ఇటీవల తమ టీమ్‌లో సరదాగా బిజ్లీ( Bijlee Dog ) అనే ఓ కుక్కను నియమించుకుంది.వారు తమ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో అది కూడా భాగమే అన్నట్లుగా ఆ శునకానికి “ఓలా ఎలక్ట్రిక్ ఐడీ కార్డ్” కూడా ఇచ్చారు.ఈ కుక్క ఐడీ కార్డులో ఎంప్లాయ్ కోడ్ కింద ‘440 V’ రాశారు.ఇది అంతా ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుందట.అందుకే దానికి సరదాగా 440V కోడ్‌తో ఈ ఐడీ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.ఇక ఈ కుక్క బ్లడ్ గ్రూప్ ‘paw+ve’ అట.సరదాగా పేర్కొన్న ఈ డీటెయిల్ కూడా నెటిజన్లను ఛానల్ నవ్వించేసింది.

కార్డులో ఈ శునకం కాంటాక్ట్ డీటెయిల్స్, ఆఫీస్ అడ్రస్ కూడా ఉంది.ఇన్‌మొబి, వన్‌ప్లస్ ఇండియా, జీరోధ వంటి ఇతర కంపెనీలు కూడా ప్రత్యేక శీర్షికలతో కుక్కలను నియమించుకున్నాయి.ట్విట్టర్ మాజీ సీఈఓ ఎలాన్ మస్క్( Elon Musk ) కూడా సరదాగా తన పెంపుడు కుక్క ఫ్లోకిని( Floki ) ట్విట్టర్ సీఈవోగా పేర్కొన్నాడు.

ఇదంతా సరదాగా తమ పెంపుడు జంతువుల ఉనికిని గుర్తించడానికి ఇలా చేస్తుంటారు.ఇకపోతే భవిష్ అగర్వాల్ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ వేదికగా షేర్ చేసిన ఈ కుక్క ఫొటోతో పాటు ఎంప్లాయ్ ఐడీ వైరల్ గా మారాయి.

ఈ కుక్క చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube