కమర్షియల్ సినిమాలు కాకుండా ఆడియెన్స్ కి నచ్చే విధంగా ప్రయోగాత్మకమైన కథలను ఎంచుకుంటాను అని సమంత గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తోంది.అయితే చెప్పినట్టుగానే అమ్మడు తన మాటను కథల ఎంపికతో నిలబెట్టుకుంటోంది.
నందిని రెడ్డి డైరెక్షన్ లో చేసిన ఓ బేబీ నేడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.రిలీజ్ కు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
నటీనటులు: సమంత, లక్ష్మి , రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావ్ రమేష్, తేజ సజ్జా, అడివి శేష్ దర్శకత్వం: నందిని రెడ్డి నిర్మాణం: సురేష్ బాబు – సునీతా తాటి
కథ: పెళ్లయిన కొన్నాల్లకె భర్తను కోల్పోయిన బేబీ (లక్ష్మి) వృద్ధ వయసులో తన పిల్లలతో మనవాళ్లతో జీవితాన్ని కొనసాగిస్తుంటుంది.అయితే హ్యాపీగా లైఫ్ సాగుతోంది అనుకున్న సమయంలో ఆమె ప్రవర్తన వారి పిల్లలకు నచ్చదు.
ఆమె చాదస్తంను భారంగా ఫీల్ అవుతుంటారు.దీంతో అనుకోని విధంగా లక్ష్మిని వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు.
యుక్త వయసులో ఎన్నో కళలకు దూరమై పిల్లల కోసం బ్రతికిన బేబీ ఆ జీవితం ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది.అప్పుడే ఒక పాత్ర ద్వారా సమంత కు వింత అనుభవం ఎదురవుతుంది.
కొన్ని ప్రకృతి వైపరీత్యాల పరిణామాలతో బేబీ ఒక్కసారిగా యంగ్ బేబీగా మారుతుంది.ఆ తరువాత యంగ్ బేబీ ఎలాంటి జీవితాన్ని చూసింది? ప్రస్తుత పరిస్థితులు ఆమెకు ఎలాంటి అనుభవాలు నేర్పాయి? ఇంతకీ బేబీ యువతికి ఎలా మారింది? అలా మరీన తరువాత తన కలల్ని ఎంతవరకు నిజం చేసుకుంది అనే విషయాల్ని తెరపై చూడాలి.
నటీనటుల నటన: చాదస్తం గల బామ్మగా లక్ష్మి తనదైన శైలిలో నటించి ఎవర్ గ్రీన్ ఆర్టిస్ట్ అని నిరూపించుకుంది.అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో కొడుకు మనవాళ్లపై ఆమె చూపించే ప్రేమ ఒక ఫీల్ ను కలిగిస్తుంది.
రావ్ రమేష్ పాత్ర కూడా సినిమాలో మంచి వినోదాన్ని ఇస్తుంది.ఇక సస్పెన్స్ రోల్ లో కనిపించే జగపతి బాబు కథకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచారు.
మెయిన్ గా సమంత తన పాత్రతో కథను సింగిల్ హ్యాండ్ తో డీల్ చేసిందని చెప్పవచ్చు, ఆమె కెరీర్ లోనే ఇదొక బెస్ట్ పర్ఫెమెన్స్ మూవీగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.నాగ శౌర్య లవర్ బాయ్ గా సమంతతో కనిపించి బాగానే ఎంటర్టైన్ చేశాడు.ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అడివి శేష్ అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు అందరిని ఆకట్టుకున్న తేజ్ సజ్జా టీనేజ్ బాయ్ గా బెస్ట్ పర్ఫెమెన్స్ ఇచ్చారు.
టెక్నీకల్ గా:
సినిమాలో మెయిన్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.సినిమాల పాత్రల పరిచయాల నుంచి ట్విస్ట్ లు అలాగే ఎమోషన్స్, క్లయిమాక్స్ ఇలా ప్రతి ఎపిసోడ్ లో మిక్కీ ఇచ్చిన నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది.అలాగే కెమెరా పనితనం కూడా పాత్రలను ప్రజెంట్ చేసిన విధానం బావుంది.
స్క్రీన్ ప్లే కి తగ్గట్టుగా సరికొత్త యాంగిల్స్ రిచర్డ్ ప్రసాద్ అందించిన ఫొటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్.ఇక అందరూ ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఈ సినిమాలో కూడా ఎడిటింగ్ విషయంలో లెంగ్త్ ఎక్కువైందనే భావన కలుగుతుంది.
ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బావుండేది.సెట్స్ – లొకేషన్స్ తెరపై ఎట్రాక్టివ్ గా అనిపిస్తాయి.
విశ్లేషణ:
జబర్దస్త్ సినిమాతో కాపీ కథ అంటూ విమర్శలు మూటగట్టుకున్న డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సారి కొరియన్ కథ మిస్ గ్రానీ అఫీషియల్ గానే రీమేక్ చేసి ప్రశంసలు అందుకుంది.బయటి దేశాల్లో కామన్ గా అనిపించే అంశాల్ని తెలుగు ప్రేక్షకులకు ఎలా చూపిస్తుందా అని కాస్త అనుమానాలు రేగినప్పటికీ ఫైనల్ గా తన మేకింగ్ తో మెప్పించింది.
అయితే అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు సెకండ్ ఆఫ్ మిడ్ లో కథ స్లోగా అవ్వడం తప్పితే అన్ని అంశాల్లో దర్శకురాలు పనితనాన్ని చూపించారు.మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి,.
కామెడీ అందిస్తూనే వృద్ధులకు సంబందించిన అంశాన్ని సెన్సిటివ్ గా చూపించారు.పాటలు సినిమాలో అంతగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బావుంది.
ఇక ఈ రెయిన్ సీజన్ లో నవ్వుల రోలర్ కోస్టార్ గా సినిమాకు ఒక పాజిటివ్ టాక్ అయితే అందుతుంది అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
సమంత నటన కథకు తగ్గట్టు సాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కామెడీ క్లయిమాక్స్
మైనెస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ స్టార్టింగ్ డల్ గా మొదలవ్వడం నిడివి కూడా సెకండ్ హాఫ్ లోనే ఎక్కువైనట్టు అనిపిస్తుంది. పాటలు అంతగా ఆకట్టుకోవు
రేటింగ్ : 3/5
బాటమ్ లైన్: ఓ బేబీ ఫన్ అండ్ ఎమోషనల్ జర్నీ
.