దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.సాధారణ ప్రజల నుంచి మొదలుకొని సినీ సెలబ్రిటీల వరకు కూడా దీపావళి( Deepavali ) పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన భార్య పిల్లలతో కలిసి దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన భార్య కొడుకులతో కలిసి ఎన్టీఆర్ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.సాధారణంగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో పెద్దగా షేర్ చేయరు.ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే తప్ప ఈయన ఆ ఫోటోలను అభిమానులతో పంచుకోరు అందుకే ఎన్టీఆర్ తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇందులో భాగంగా లక్ష్మీ ప్రణతి ( Lakshmi Pranathi ) ఎంతో చక్కగా చీర కట్టుకొని ఉండగా తన ఇద్దరు కుమారులు ఎన్టీఆర్ కుర్తా ధరించి ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించారు.
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ ఫోటోలలో ఎన్టీఆర్ చిన్న కుమారుడు చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇలా చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీ( Ntr Family ) ని ఒకే ప్రేమ్ లో చూడటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా( Devara Movie )షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.