ఒక భారీ బడ్జెట్ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలంటే ఎంతో కష్టపడాలి కానీ ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ ను వైరల్ చేయడం మాత్రం కష్టం కాదు.ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఊహించని స్థాయిలో నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది.
దమ్ము, రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాల విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) సినిమాలకు వ్యతిరేకంగా ప్రచారం జరగడం గమనార్హం.ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం పెద్దగా లేకపోయినా మొబైల్ మెసేజ్ ల ద్వారా ఎక్కువగా నెగిటివ్ ప్రచారం చేశారు.
సినిమాల మార్నింగ్ షో కూడా ప్రదర్శితం కాకముందే సినిమా ఫ్లాప్ అంటూ వైరల్ అయిన మెసేజ్ లు మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపాయి.అయితే అప్పుడు ఎన్టీఆర్ విషయంలో జరిగిందే ఇప్పుడు మెగా హీరోల సినిమాల విషయంలో జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మెగా హీరోల సినిమాలకు విడుదలకు ముందే నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతోంది.సెన్సార్ రివ్యూ, ఫస్ట్ రివ్యూ, క్రిటిక్స్ రివ్యూల పేర్లతో సినిమా గురించి వ్యతిరేకంగా ప్రేక్షకుల ఆలోచనలను మార్చే ప్రయత్నం జరుగుతోంది.సినిమా రిలీజ్ రోజున మార్నింగ్ షో కూడా ముగియక ముందే సినిమాలో నెగిటివ్ పాయింట్లు ఇవేనని, సినిమా అస్సలు బాలేదంటూ ట్వీట్స్, మీమ్స్ రూపంలో నెగిటివ్ ప్రచారం జరుగుతోంది.
దారుణంగా జరుగుతున్న పబ్లిసిటీ వల్ల సినిమా చూడాలని అనుకున్న వాళ్లు సైతం నిర్ణయాలు మార్చుకుంటున్న పరిస్థితి నెలకొంది.పెద్ద సినిమాలను టార్గెట్ చేసి చంపేసే కుట్ర జరుగుతోంది.భోళా శంకర్, గాండీవదారి అర్జున( Gandeevadhari Arjuna ) సినిమాలకు సంబంధించి కొన్ని తప్పులు జరిగినా చిరంజీవి, వరుణ్ తేజ్( Chiranjeevi ) రేంజ్ కు రావాల్సిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.
మెగా హీరోలు తమ సినిమాలకు సంబంధించి జరుగుతున్న నెగిటివ్ ప్రచారం విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది.