అదే జరిగితే సినిమాలు ఆపేస్తానంటున్న నాని..!

నాని టక్ జగదీష్ పై నిన్న మొన్నటిదాకా జరిగిన హంగామా తెలిసిందే.రిలీజ్ విషయంలో నిర్మాతల ఇబ్బందిని ఆలోచించి ఓటీటీకే ఓటేసిన నానిపై ఎగ్జిబిటర్లు కొందరు టార్గెట్ చేశారు.

 Nani Sensational Speech At Tuck Jagadish Trailer Release Event,tags: Tuck Jagadi-TeluguStop.com

నాని సినిమాను బ్యాన్ చేస్తామన్న రేంజ్ లో వారి వాదన వినిపించారు.అయితే ఇదే విషయాన్ని నాని ముందు ప్రస్థావిస్తే.

పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని అన్నారు.ఇండస్ట్రీలో చాలా పెద్ద వారైన వారు తనని అలా అనడం పై స్పందించిన నాని వాళ్లంటే తనకు చాలా రెస్పెక్ట్ అని అన్నారు.

అంతేకాదు బయట పరిస్థితులు అన్ని బాగుండి.అంతా సెట్ రైట్ అయిన తర్వాత కూడా నా సినిమా ఇలా ఓటీటీ రిలీజ్ చేస్తే.

వారు బ్యాన్ చేయడానికి ముందే తానే సినిమాలు చేయడం ఆపేస్తానని అన్నారు నాని.

మొత్తానికి నాని ఎగ్జిబిటర్ల ఇష్యూపై బాగానే డిస్ట్రబ్ అయినట్టు అనిపిస్తుంది.

అయితే నాని ఎక్కడ తన టంగ్ స్లిప్ అవకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడి అందరి మనసులు గెలిచాడు.తెలుగు ప్రేక్షకులు సినిమా ఎక్కడ వచ్చినా ఆదరిస్తారని అందుకే టక్ జగదీష్ ఓటీటీ వస్తుందని అన్నారు.

మరి నాని చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube