నాని 'అంటే సుందరానికి' ఫైనల్‌ కమర్షియల్‌ ఫలితం పై క్లారిటీ వచ్చేసింది

నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా రూపొందిన అంటే సుందరానికి సినిమా విడుదల అయ్యి రెండు వారాలు గడుస్తోంది.ఇప్పటి వరకు ఈ సినిమా సాధించిన వసూళ్లు ఓవరాల్ గా చూస్తే చాలా డిసప్పాయింట్ గా ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.

 Nani Ante Sundaraniki Movie Collections , Ante Sundaraniki , Ante Sundaraniki-TeluguStop.com

హీరోయిన్‌ గా నజ్రియా ఈ సినిమా తో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ను దక్కించుకున్నట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.కాని ఇప్పటి వరకు సినిమా బ్రేక్ ఈవెన్ సాధ్యం కాలేదట.

సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినా.పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా వసూళ్లు మాత్రం చాలా నిరాశ పర్చడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఓవర్సీస్ లో సినిమా లు ఒక మోస్తరు గా వసూళ్లను సాధిస్తున్నాయి.ఈ సినిమా కూడా ఈజీగానే అక్కడ మిలియన్ డాలర్లు వసూళ్లు చేసింది.

అంటే సుందరానికి తెలుగు రాష్ట్రాల్లో రాబడుతున్న వసూళ్ల విషయంలోనే అసలు సమస్య.

గతంలో సినిమా లు యావరేజ్ టాక్ దక్కించుకుంటే ఒక మోస్తరు వసూళ్లను సాధించేవి.

కాని ఇప్పుడు థియేటర్ల వద్ద ఉన్న టికెట్ల రేట్ల కారణం గానో లేదా మరేంటో కాని భారీ ఎత్తున వసూళ్లు తగ్గాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో అంటే సుందరానికి సినిమా కు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అయినా కూడా వసూళ్లు చాలా డల్ గా ఉండటం కు కారణం ఏంటీ అనేది సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.ఈమద్య కాలంలో ఇతర సినిమా లు కూడా పాజిటివ్ టాక్ దక్కించుకుని దారుణమైన వసూళ్లను చవి చూడాల్సి వచ్చింది.

మొత్తానికి అంటే సుందరానికి సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుని డిజాస్టర్ వసూళ్లను నమోదు చేసింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు తేల్చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube