Nani : నేను ఇంతే.. నేను ఎవరి కోసం మారాను.. నా ప్రపంచం చిన్నది : నాని

నాని( Nani )… అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి హీరోగా ఎదిగి ప్రస్తుతం నాచురల్ స్టార్ గా నిలబడ్డాడు.నాని చాలామంది హీరోలకు భిన్నమైన వ్యక్తి.

 Nani About His Own Rules Book-TeluguStop.com

మొన్నటి వరకు దసరా ( Dussehra )సినిమాతో మాస్ మసాలా ధూమ్ ధం చేసి ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో ఆ సెలబ్రేషన్స్ ని కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడు.అయితే చాలామంది హీరోలతో పోలిస్తే నాని భిన్నమైన వాడు అని ఊరికే అనలేదు.

కొన్ని క్వాలిటీస్ అతని హీరోగా స్టార్ హీరోగా, నాచురల్ హీరోగా నిలబెట్టాయి.మరి ఆ క్వాలిటీస్ ఏంటి ? ఎందుకు నాని మాత్రమే స్పెషల్ అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Dussehra, Nani, Tollywood-Movie

నాని తన సినిమా కెరియర్ లో కొన్ని విషయాలకు ఖచ్చితమైన సమాధానాలు చెబుతాడు.అందులో ముఖ్యంగా ఇప్పుడు తీస్తున్న సినిమాలన్నీ కూడా ఒరిజినల్ కథలు కావడం విశేషం.గతంలో రెండు సినిమాలు మాత్రమే రీమేక్ చిత్రాలలో నటించిన నాని అప్పటి నుంచి కేవలం తన దర్శకులు చెప్పే సొంత కథలపైనే ఆధారపడుతున్నాడు.కంటెంట్ ఉంటే కథ ఏదైనా కూడా సినిమా చూస్తున్నారని, భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే మాత్రమే చూస్తున్నారని అందుకే రీమేక్ కన్నా కూడా ఒరిజినల్ ఎప్పుడూ బెటర్ అని నాని అభిప్రాయపడుతున్నాడు.

Telugu Dussehra, Nani, Tollywood-Movie

ఇక ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) తో పాటు బ్యాన్ ఇండియా వ్యాప్తంగా మల్టిస్తారు ట్రెండు బాగా నడుస్తుంది.కానీ నాని మాత్రం అందుకు సిద్ధంగా లేడు తాను కేవలం తన సినిమాలపైనే ఫోకస్ చేస్తానని మిగతా హీరోలను తన సినిమాలో పెట్టుకుని తీయాలని ఉద్దేశం లేదని చెబుతున్నాడు.అలాగే వేరే హీరోల సినిమాల్లో కూడా కనిపించాలన్న ఆశ కూడా తనకు లేదు అన్నాడు.ఇక ప్రయోగాలు చేయడం విషయంపై స్పందించిన నాని తాను ఎల్లప్పుడూ ప్రయోగాలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు.

అంతేకాదు తన ముందు తనకు ఎంతో నచ్చిన దర్శకుడు ఉన్నా కూడా తనకు అవకాశం ఇవ్వాలని ఏ రోజు అడగలేదు అంటూ చెప్పుకచ్చాడు.నేను ఇంతే అని, నేను ఎప్పుడూ ఇలాగే ఉంటానని, నన్ను ఇలాగే ప్రేక్షకులు ఆదరించారని ఇకపై కూడా ఇలాగే ఉండబోతానని నానీ స్పష్టం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube