యూకేలో బతుకమ్మ సబరల్...పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే

నల్లగొండ జిల్లా:తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం లండన్ లోని దగ్గేనంలో యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం దాటి వచ్చినా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహిళలు అందరూ ఒకే చోట కలిసి పువ్వులను పూజించే పండుగ చేసుకోవడం గర్వకారణమన్నారు.విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్నా తీరు చాలా గొప్పదన్నారు.

Nakirekal MLA Who Participated In Bathukamma Sabaral In UK , Sabaral In UK, Bath

తెలంగాణ ఎన్నారైలు అందరూ సమాజం సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని,ఇక్కడ వరకు వచ్చి బతుకమ్మ వేడుకలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత
Advertisement

Latest Nalgonda News