Naga Chaitanya : మా అమ్మకు విలువలు అంటే ప్రాణం, చాలా కఠినంగా ఉండేవారు: నాగ చైతన్య

టాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్యకు తన తల్లి లక్ష్మి దగ్గుబాటి( Lakshmi Daggubati )తో మంచి అనుబంధం ఉంది.లక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత డి.

 Naga Chaitanya About His Mother Lakshmi-TeluguStop.com

రామానాయుడు, రాజేశ్వరి దంపతుల కుమార్తె.విక్టరీ వెంకటేష్‌కి ఆమె స్వయానా సోదరి అవుతుంది.

లక్ష్మి అక్కినేని నాగార్జునను 1984లో వివాహం చేసుకుంది.వారికి నాగ చైతన్య 1986లో జన్మించాడు.

అయితే ఈ జంట 1990లో విడాకులు తీసుకున్నారు.విడాకుల తర్వాత లక్ష్మీ దగ్గుబాటి తన కొడుకుతో కలిసి చెన్నైకి వెళ్లింది.

అక్కడ తన తల్లితోనే కలిసి 18-19 ఏళ్లు పాటు జీవించానని చైతూ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.చైల్డ్ హుడ్, స్కూలింగ్ లైఫ్ అంతా ఆమెతో కలిసి చేసిన జర్నీ తన జీవితాన్ని మార్చేసిందని తెలిపాడు.

Telugu Ramanaidu, Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Tollywood-Movie

తన తల్లి లక్ష్మి చాలా స్ట్రిక్ట్ అని, ఎథిక్స్ ఉన్న మనిషి అని, తన నుంచే చాలా విషయాలు తాను నేర్చుకున్నానని తెలిపాడు.అవతలి వ్యక్తి థాట్ ప్రాసెస్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం తనకు తన తల్లి నుంచే అలవాటైందని పేర్కొన్నారు.చైతూ( Naga chaitanya ) అమ్మ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఇకపోతే సుందరం మోటార్స్‌లో కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్ అయిన శరత్ విజయరాఘవన్‌ని ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంది.

లక్ష్మి దగ్గుబాటి వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్.ఆమె విజయవంతమైన వ్యాపారవేత్త కూడా.

ఆమె ఇంటీరియర్ డిజైన్ సంస్థ లక్ష్మీ ఇంటీరియర్స్ వ్యవస్థాపకురాలు.

Telugu Ramanaidu, Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Tollywood-Movie

లక్ష్మి దగ్గుబాటి ఒక ప్రైవేట్ వ్యక్తి, లైమ్‌లైట్ దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.అయితే, ఆమె నాగ చైతన్యకు ప్రేమ, మద్దతు ఇచ్చే తల్లి.ఆమె తన మాజీ భర్త నాగార్జున( Nagarjuna )కు కూడా సన్నిహితురాలు.ఇటీవలి సంవత్సరాలలో, లక్ష్మి దగ్గుబాటి తన కుమారుడితో కలిసి తరచుగా పబ్లిక్‌లో కనిపిస్తున్నారు.ఆమె అతని అనేక సినిమా ప్రీమియర్లు, అవార్డు షోలకు కూడా హాజరయ్యారు.ఆమె ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా రెగ్యులర్‌గా కనిపిస్తున్నారు.

ఏది ఏమైనా వీరి మధ్య ఉన్న బ్యూటిఫుల్ బాండ్ అక్కినేని అభిమానుల మనసులను దోచేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube