కోకాపేటలోని నియోపోలిస్ వేలంతో హైదరాబాద్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది.గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేశంలో రారాజుగా మారిందని చెప్పుకోవచ్చు.కోకాపేట భూములు ఎకరం రూ.100 కోట్లకు పైగా రికార్డు స్థాయి ధరలు పలికిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ మరోచోట భూముల వేలానికి సిద్ధమైంది.బుద్వేల్ లో వంద ఎకరాల భూమి వేలానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.కోకాపేటకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్వేల్ లో 14 ఫ్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ ప్రకటన ఇచ్చింది.ఈనెల 10వ తేదీన రెండు సెషన్లలో వేలంపాటను నిర్వహించనున్నారు.
ఈ మేరకు 1, 2 , 4, 5, 8, 9, 10 ఫ్లాట్లకు ఉదయం పూట వేలం జరగనుండగా 11, 12, 13, 14, 15, 16, 17 ప్లాట్లకు మధ్యాహ్నం వేలం జరగనుంది.కాగా ఎకరా ధర రూ.20 కోట్లుతో పాటు కనీస్ బిడ్ పెంపుదల రూ.25 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.







