ప్రాజెక్ట్ కే కోసం ఆనంద్ మహీంద్ర సాయం కోరిన నాగ్ అశ్విన్..!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

 Nag Ashwin Asks Anand Mahindra Help For Prabhas Project K Details,  Nag Ashwin,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ ల ఫస్ట్ షాట్ ను మూవీ మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఇక ఇదే విషయాన్ని అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

మొదటి రోజు.మొదటి షాట్.

బాహుబలి ప్రభాస్‌తో మొదటి సినిమా.ఆయన ప్రతిభ, వినయం, నేర్చుకోవడం వంటివి అద్భుతం… ప్రభాస్ తో కలిసి చేయడం గౌరవంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

తాజాగా ఈ సినిమా రెండవ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఎంతో ప్ర‌తిష్టాత‌క్మ‌కంగా వైజయంతి మూవీస్ బేన‌ర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం కూడా భారీ స్థాయిలో గ్రాఫిక్స్ అవసరం ఉంది కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకు వస్తున్నారు.

ఆ సినిమా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.

Telugu Aanand Mahindra, Amitab Bachchan, Anand Mahindra, Nag Ashwin, Prabhas, Pr

ఇక ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం చాలా ఖర్చు అవుతున్నట్లు సమాచారం.ఇంటర్వెల్ సన్నివేశాల కోసం 60 నుంచి 70 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.క్లైమాక్స్ లో వచ్చే విఎఫ్ఎక్స్ సన్నివేశాలకి కూడా భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే నిర్మాతలు దాదాపుగా 170 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మార్చేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఆనంద్ మ‌హీంద్రా సహాయం కోరుతున్నాడు.

నేను అమితాబ్, దీపిక‌, ప్ర‌భాస్‌ తో క‌లిసి ప్రాజెక్ట్ కె అనే భారతీయ అనే సైన్స్ ఫిక్ష‌న్ చిత్రాన్ని రూపొందిస్తున్నాను.

Telugu Aanand Mahindra, Amitab Bachchan, Anand Mahindra, Nag Ashwin, Prabhas, Pr

ఈ ప్ర‌పంచం కోసం మ‌నం నిర్మిస్తున్న వాహ‌నాలు నేటి సాంకేతికతకు మించిన ప్రత్యేకత కలిగివున్నాయి.ఈ చిత్రం అద్భుతంగా ఉంటే ఇది మన దేశానికి గర్వకారణం అని భావించాలి.మా ప్రాజెక్ట్‌లో పూర్తిగా ఇండియన్ టీమ్ ఇంజనీర్ లు మరియు డిజైనర్ లు ఉన్నారు.

ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించలేదు.ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించడంలో మీరు మాకు సహాయం చేయగలిగితే బాగుంటుంది అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు నాగ్ అశ్విన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube