పోలీస్ రిక్రూట్మెంట్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలని ఎమ్.ఎస్.పి, ఎమ్మార్పీఎస్ డిమాండ్..

ఖమ్మం: నగరంలో శుక్రవారం ఎం.ఎస్.పి జిల్లా కో - ఆర్డినేటర్ ఏపూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎం.

ఎస్.పి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గుంతేటి వీరభద్రం, ఎల్హెచ్పీఎస్ నాయకులు భద్రునాయక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్, ఎరుకుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మూకర ప్రసాద , ఉపేందర్, గాంధీ యాదవ్, భూసి గౌడ్, శ్రీనివాసరావు నాయకులు ప్రసంగిస్తూ 2022వ సంవత్సరంలో ఎస్సై కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కౌంట్ మార్కులు పై వివక్షత తగదని అన్నారు.

పాలకుల అనైతిక విధానాలను తిప్పికొట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హక్కులను రక్షించుకోవటములో మన ప్రతినిధులు విఫలం కావడం వలనే 7శాతం ఉన్నా అగ్రకులాలు మన హక్కులను హరీస్తూ కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మందకృష్ణ మాదిగ తీసుకున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆనందరావు, తురుగంటి అంజయ్య, వెంకటేశ్వర్లు, సునీల్, భద్రం, ప్రేమ్చంద్, ప్రభాకర్, సుధాకర్, రత్నాకర్, సురేష్, రత్నం, రోజా తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం. మేకను రేప్ చేసిన కామాంధుడు.. వీడియో వైరల్..
Advertisement

Latest Latest News - Telugu News