కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్

నల్లగొండ జిల్లా: రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.

గురువారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డులో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని,రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశారని, రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలన్నారు.

MLA Mandula Samel Inaugurated The Purchasing Center, MLA Mandula Samel, Inaugura

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, తహశీల్దార్ యాదగిరి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి,మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరిగె నరసింహ, ప్యాక్స్ చైర్మన్ తాళ్లూరి మురళి,సీఈవో నిమ్మల ఆంజనేయులు,ఏవో సౌమ్య శృతి,కందాల సమరం రెడ్డి, అన్నెబోయిన సుధాకర్, గూని వెంకటయ్య,భూపతి అంజయ్య,వేముల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News