నల్లగొండ జర్నలిస్టులపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వివక్ష

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని వేదపాఠశాల దగ్గర 11 మంది రిపోర్టర్లకు,ఐదుగురు ఎమ్మెల్యే అనుచరులకు 240 గజాల చొప్పున ఇళ్ళ స్థలాలు కేటాయించారు.ఎమ్మార్వో నాగార్జున రెడ్డి( Mro Nagarjuna Reddy ) సహాయంతో 59 జీవోను అడ్డుపెట్టుకుని ఖరీదైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేసారనే చర్చ జోరుగా సాగుతుంది.

మరి నల్గొండలో ఎంతో మంది ఇళ్లులేని నిరుపేద జర్నలిస్టులు ఉన్నారని నల్లగొండలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిరసన తెలిపారు.25 ఏళ్లుగా నల్గొండలో జర్నలిస్టులుగా ( journalists )పని చేస్తున్న వారిని కాదని ఇటీవల కొందరు ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని గురువారం ఉదయం రామగిరి సెంటర్లో జర్నలిస్టులు నిరసన తెలిపారు.

అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు,కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు రెండేళ్లుగా ఎమ్మెల్యే ( Kancharla Bhupal Reddy )చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారని, తిరుపతి ప్రసాదం తినుకుంటూ తిరుమల వెంకన్న సాక్షిగా ఇళ్ళ స్థలాలు ఇస్తానని ఎమ్మెల్యే ప్రామీస్ చేశాడని,ఇప్పుడు వారందరి పొట్ట కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండేళ్లుగా ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తానని చెప్పి కెమెరామెన్లతో గొడ్డు చాకిరి చేయించుకున్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి ఖచ్చితంగా వారి ఉసురు తాకుతదని శాపనార్థాలు పెట్టారు.

మధ్యాహ్న భోజనమా...మరణ ఆహారమా...?
Advertisement

Latest Nalgonda News