ఎమ్మెల్యే గాదరి కిషోర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి...!

నల్లగొండ జిల్లా: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు,మాదిగ జాతికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెస్సీ నల్గొండ జిల్లా ఇంచార్జ్ ఆడెపు నాగార్జున, ఎమ్మార్పీఎస్ దేవరకొండ నియోజకవర్గం ఇంచార్జ్ పోతం సహదేవుడు డిమాండ్ చేశారు.

శనివారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏ పల్లి మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో దళిత బంధు( Dalit Bandhu )పై మాట్లాడే క్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను కొడుకులు అంటూ చేసిన వ్యాఖ్యలు అతని అహంకారానికి నిదర్శనమని,అతని మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ప్రతిపక్ష కార్యకర్తలకు ఎమ్మార్పీఎస్ కొడుకులకు దళిత బంధు పథకాన్ని ఇచ్చామంటూ మాదిగ జాతిని హేళన చేసిన ఎమ్మెల్యే తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు.

MLA Gadari Kishore Should Apologize Publicly...!-ఎమ్మెల్యే గ

దళిత బంధు ఎమ్మెల్యే ఇంట్లో నుండి తన అయ్యా ఆస్తులమ్మి ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే లాగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక మాఫియాతో కోట్లాది రూపాయలు ఎమ్మార్పీఎస్ నేతలు సంపాదించలేదని, అణగారిన వర్గాల ప్రజల కోసం గత 30 ఏళ్లుగా సామాజిక న్యాయమే ఎజెండాగా ఉద్యమాలు చేస్తున్నామని గుర్తు చేశారు.

గాదరి కిషోర్ కేసీఆర్ పెంపుడు కుక్కలా వ్యవహరిస్తూ దళిత, అణగారిన వర్గాలపై మొరుగుతున్నాడనిమండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో దొరలు రాచరిక పాలన కొనసాగిస్తుంటే దొర వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడిబిఆర్ఎస్ పార్టీలో ( BRS party )ఉంటూ ఏ సామాజిక వర్గం నుంచి అయితే వచ్చిందో ఆ సామాజిక వర్గాలను అవమానంగా మాట్లాడటం వెనుక కేసీఆర్ విషకౌగిలిఉందని ఆరోపించారు.

Advertisement

అధికారం తలకెక్కిబలుపెక్కిన మాటలు మాట్లాడుతున్న గాదరి కిషోర్ ఎమ్మార్పీఎస్ నాయకులకు క్షమాపణ చెప్పని పక్షంలో తుంగతుర్తిలో గుడ్డలు విప్పి,చెప్పుల దండలు వేసి, బజార్ల వెంట పిచ్చికుక్కను కొట్టినట్టు తరిమితరిమి కొడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఎమ్మెఎస్పీ దేవరకొండ నియోజకవర్గం ఇన్చార్జి మారుపాక గోపాల్,ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ పేర్ల కొండలు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News