కాలుష్యం కోరల్లో మిర్యాలగూడ...!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణానికి కాలుష్య ముంపు పొంచి ఉంది.

ఆసియాలోనే అతి పెద్ద ఫార్ బాయిల్డ్ ఇండస్ట్రీ కలిగి ఉండడంతో నిత్యం మిల్లుల నుంచి విలువడే వాయు కాలుష్యంతో పట్టణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

దీనికి తోడు పట్టణానికి కూతవేటు దూరంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి,పట్టణ వ్యర్దాలను టన్నుల కొద్దీ తరలించి, దశల వారీగా తగల బెడుతున్నారు.దీనితో వ్యర్థాలతో వచ్చే అనర్ధాల పొగ పట్టణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇదీ చాలదన్నట్లు డంపింగ్ యార్డ్ పక్కనే ఇటుక బట్టీలు పెట్టడంతో వాటి నుండి వచ్చే విషవాయువుతో కూడిన గాలిని పీల్చడం వలన చుట్టుపక్కల గ్రామాలైన గూడూరు,ఈదులగూడెం,రాంనగర్ బంధం, బాధలాపురం ప్రజలు నిత్యం శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో,విషజ్వరాలతో మంచం పడుతున్నారు.రోగాలతో హాస్పిటల్ కి వెళితే లక్షలలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో ప్రజల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి డంపింగ్ యార్డ్, ఇటుక బట్టీలను పట్టణానికి దూరంగా తరలించి,కాలుష్య కోరల్లో చిక్కుకున్న మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

Advertisement
నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!

Latest Nalgonda News