మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హత్య కేసులో నిందితుడు: మంత్రి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్

నల్లగొండ జిల్లా:మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీశ్‌ రెడ్డి సవాలును తాను స్వీకరిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

జగదీశ్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని, దొంగతనం కేసులోనూ జగదీశ్‌రెడ్డి నిందితుడేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో జగదీశ్‌రెడ్డి ఏ2 ముద్దాయి అని,ఆయనను ఏడాదిపాటు జిల్లా నుంచి బహిష్కరించారన్నారు.

నిరూపించలేకపోతే నేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.దీనితో నల్లగొండ జిల్లా రాజకీయాల్లో పెను దుమారం రేగుతుంది.

మహిళల భద్రతకు ప్రత్యేక వాచ్...!
Advertisement

Latest Nalgonda News