మామిడి తోటలను( Mango plantations ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే బ్యాక్టీరియల్ నల్ల మచ్చ తెగులు ఒక బ్యాక్టీరియా( Bacteria ) ద్వారా సోకుతుంది.ఈ బ్యాక్టీరియా దాదాపుగా 8 నెలల వరకు జీవకణాల పైన జీవిస్తుంది.
మొక్కలకు గాయాలు అయితే వాటి ద్వారా చెట్టును ఆశిస్తుంది.ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు గాలి లేదా వర్షం ద్వారా వ్యాపిస్తుంది.
మామిడి చెట్ల ఆకులపై, కాయలపై ఈ తెగుళ్ళ లక్షణాలను గుర్తించవచ్చు.మొదట్లో చిన్న నల్లటి మచ్చలు ఆకులపై కనపడతాయి.
ఆ మచ్చలు క్రమంగా పెరిగి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.ఈ తెగుళ్లు సోకిన ఆకుల నుంచి జిగురు లాంటి పదార్థం కారణం కూడా గమనించవచ్చు.
గుల్ల తీవ్రత పెరిగితే పండ్ల నాణ్యత తగ్గుతుంది.పండ్లు కోతకు రాకముందే నేలరాలే అవకాశం కూడా ఉంది.
తెగులు నిరోధక మొక్కలను( Pest resistant plants) ఎంపిక చేసుకుని నాటుకోవాలి.తోటలలో పరిశుభ్రం చేసిన పరికరాలను మాత్రమే ఉపయోగించాలి.మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగినట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా తోటలలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు గాయాలు కాకుండా చూసుకోవాలి.
సేంద్రీయ పద్ధతిలో ఈ తెగుళ్లను నివారించాలంటే.కాపర్ ఆక్సి క్లోరైడ్( Oxy chloride ) కలిగి ఉండే పదార్థాలను మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.అసినేటో బాక్టెర్ బౌమాన్ని లాంటి జీవ నియంత్రణ ఏజెంట్లను తెగులు సోకిన మొక్కలపై ప్రయోగించడం వల్ల వాటి ఉద్ధృతి తగ్గుతుంది.ఈ తెగుళ్లను రసాయన పద్ధతిలో నివారించాలనుకుంటే.
థియోఫనేట్-మిథైల్ లేదంటే