కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం ? రేవంత్ స్పందన ఏంటంటే ? 

తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో వైఎస్సార్  తెలంగాణ పార్టీని స్థాపించారు వైస్ షర్మిల( Ys sharmila ) చేరికలతో పార్టీని బలోపేతం చేసి బలమైన శక్తిగా తెలంగాణలో అవతరించాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.పాదయాత్రలు చేపడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం( Brs party )పై విమర్శలతో విరుచుకుపడుతూ వస్తున్నారు.

 Merger Of Sharmila's Party In Congress? What Is Revanth Reddy Response, Telan-TeluguStop.com

ఎన్ని చేసినా ఆశించిన స్థాయిలో షర్మిల పార్టీ బలోపేతం కాకపోవడం , చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో అంతంత మాత్రంగానే ప్రభావం చూపిస్తుందని అంత భావిస్తుండగా,  కాంగ్రెస్ వైపు షర్మిల చూపు పడింది.

కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

Telugu Apcc, Dk Siva Kumar, Sharmila, Telangana, Telangana Bjp, Tpcc, Ys Sharmil

ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం లో కీలకపాత్ర పోషించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కుటుంబంతో షర్మిలకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో,  ఆయన ద్వారానే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కీలకంగా వ్యవహరించేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఘాటుగా స్పందిస్తున్నారు.తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ వాళ్లు పరిపాలించుకోవడానికి అని,  అటువంటిది షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే ఊరుకుంటామా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

పక్క రాష్ట్రానికి చెందిన షర్మిల ఏపీ కాంగ్రెస్ కు పని చేస్తే తాను స్వాగతిస్తానని, షర్మిల ఎపిసిసి చీఫ్ గా పనిచేస్తే , సహచర పీసీసీ చీఫ్ గా తాను కలుస్తాను అని, కానీ ఇక్కడ తాను ఉన్నన్ని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండబోదని రేవంత్ చెబుతున్నారు.

Telugu Apcc, Dk Siva Kumar, Sharmila, Telangana, Telangana Bjp, Tpcc, Ys Sharmil

తెలంగాణ కి నాయకత్వం వహిస్తానని షర్మిల అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమేనని రేవంత్ చెబుతున్నారు.వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిని నియమిస్తారని జరుగుతున్న ప్రచారంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు,  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా షర్మిల ఈ ప్రయత్నాలు చేస్తుండడం తో ముందుగానే రేవంత్ అలెర్ట్ అవుతూ , షర్మిల తెలంగాణ వ్యక్తి కాదనే విషయాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube