బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల నుండి మిరప పంటను సంరక్షించే చర్యలు..!

మిరప పంటను సాగు చేసే రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ సంరక్షణ చర్యలు చేస్తూ ఉండాలి.మిరప( Chilli ) అధిక ఆదాయం తెచ్చే పంట మాత్రమే కాదు తీవ్ర నష్టాన్ని కలిగించే పంటగా చెప్పుకోవచ్చు.

 Measures To Protect Chilli Crop From Bacterial Leaf Spot , Bacterial Leaf Spot R-TeluguStop.com

కాబట్టి ఈ పంట సాగుపై పూర్తి అవగాహన తప్పనిసరి.ఈ పంట సాగు చేయాలంటే భూమి యొక్క పీహెచ్ విలువ 5.5 నుంచి 6.6 మధ్యలో ఉండాలి.నల్లరేగడి, ఎర్ర నేలలు( Black, red soils ) మిరప పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Telugu Agriculture, Bacterialleaf, Black, Chilli, Latest Telugu, Red Soils-Lates

మిరప పంట సాగుకు ఉష్ణోగ్రత 15 నుండి 35 డిగ్రీల మధ్యలో ఉంటే అధిక దిగుబడి సాధించవచ్చు.మిరప పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగులు ఏమిటో.? వాటిని ఎలా గుర్తించాలి.ఎలా నివారించాలి అనే విషయాలను తెలుసుకుందాం.బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు( Bacterial leaf spot rot ) ఈ తెగులు జాంతోమొనాస్ కాంపెస్టిస్ ఎసికటోరియా అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది.

మిరప మొక్క ఆకులపై చిన్న చిన్న గుండ్రని మచ్చలు అడుగు బాగాన ఏర్పడతాయి.ఈ మచ్చలు మొదట ముదురు గోధుమ రంగులో ఏర్పడి తర్వాత ఊదా రంగులోకి మారి మధ్యలో నల్లగా ఉంటాయి.

తరువాత ఈ మచ్చలు ఉబ్బి గరుకుగా మారుతాయి.ఈ మచ్చలు ఆకు అంతా వ్యాప్తి చెంది చివరికి ఆకులు ఎండి రాలిపోతాయి.వీటిని సకాలంలో గుర్తించకపోతే ఆకు తొడిమ, లేత కొమ్మలపై వ్యాపిస్తుంది.చివరికి లేతమిరపకాయలపై ఈ మచ్చలు ఏర్పడి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి.

Telugu Agriculture, Bacterialleaf, Black, Chilli, Latest Telugu, Red Soils-Lates

ఈ ఆకు మచ్చ తెగులను సకాలంలో గుర్తించి వెంటనే పిచికారి మందులు ఉపయోగించి నివారించాలి.ఒక లీటరు నీటిలో ఫాంటోమైసిస్( Fantomyces ) తో పాటు ఏదైనా శిలీంద్రా నాశిని 0.25% కలిపి రెండు లేదా మూడుసార్లు మొక్కలు మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.లేదంటే ఒక లీటరు నీటిలో స్ట్రేప్టోసైక్లిస్ 200కు ఏదైనా రాగి దాతువు కలిగిన శిలీంద్ర నాశిని 0.25% కలిపి పంటకు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube