తమిళ నటుడు ప్రముఖ కమెడియన్ మనోబాల (Manobala) నిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.తెలుగు తమిళ భాషలలో సుమారు 700 పైగా సినిమాలలో నటించిన ఈయన లివర్ సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.
తెలుగు తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి మనోబాల మరణం పట్ల ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఇండస్ట్రీలో ఈయన అజిత్, విజయ్, సూర్య, రజినీకాంత్, వంటి అగ్ర హీరోలందరి సినిమాలలో నటించారు.ఇక ఈయన మరణ వార్త తెలియడంతో స్టార్ సెలబ్రిటీలందరూ కూడా మనోబాల చివరి చూపు కోసం తరలివచ్చారు.ఈ క్రమంలోనే నటుడు జోష్ రవి(Josh Ravi) కూడా మనోబాల చివరి చూపు కోసం రావడమే కాకుండా ఆయన తనకు అభిమాన నటుడు అని చెబుతూనే మనోభాల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.
హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ( Ramoji Film City) లో వివిధ భాష చిత్రాలు ఇక్కడ తెరకెక్కిస్తూ ఉంటారు.అయితే సినిమా షూటింగుల నిమిత్తం మనోబాలా గారు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీకి వస్తే ఆయన రామోజీ ఫిలిం సిటీ లోకి ఎంటర్ అయ్యే ముందు కారు దిగి చెప్పులు పక్కన వదిలి రామోజీ ఫిలిం సిటీ ముందు నమస్కారం చేసుకొని మరి లోపలికి అడుగుపెట్టేవారని ఈ సందర్భంగా జోష్ రవి మనోబాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.నటన అన్నా,పనిచేసే ప్రదేశానికి ఆయన అంత విలువ ఇస్తారని ఈ సందర్భంగా జోష్ రవి మనోబాల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.