టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద తనయుడు మంచు విష్ణు గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.గతంలో మంచు విష్ణు ఢీ, విష్ణు, అస్త్రం, దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం, వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికి ఈ మధ్యకాలంలో విష్ణు నటించినటువంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలువుతున్నాయి.
అందువల్ల కథల విషయంలో కొంత మేర మంచు విష్ణు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
అయితే తాజాగా మంచు విష్ణు తన తదుపరి చిత్రం కోసం బాగానే శ్రమిస్తున్నాడు.
ఇందులో భాగంగా మంచు విష్ణు సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు.తాజాగా మంచు విష్ణు ఓ వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.
వీడియోలో విష్ణు పూర్తిగా గడ్డం పెంచుకొని, కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు.అయితే వీడియోలో తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమకు చెందినటువంటి పలువురు ఫైట్ మాస్టర్లతో స్టంట్లు చేస్తూ కనిపించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.ఈ వీడియోలో విజయన్, దిలీప్ సుబ్బరాయన్, అనల్ అర్సు, విజయ్, అన్బు, శబరీష్, స్టన్ శివ, కనల్ కన్నన్ తదితరులు ఫైట్ స్టంట్లు చేస్తూ కనిపించారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు విష్ణు “మోసగాళ్లు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
అయితే ఈ చిత్రాన్ని జూన్ 5వ తారీఖున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నప్పటికీ వైరస్ కారణంగా మరింత కాలం పాటు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.