అభిమాన హీరోకి బంగారం ఆఫర్ చేసిన లేడీ ఫ్యాన్... హీరో రియాక్షన్ ఇదే!

సాధారణంగా సినీ సెలబ్రిటీలకు ఎంతోమంది అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే వారి పై ఉన్న అభిమానాన్ని వివిధ రూపాలలో తెలియజేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో వరణ్‌ ధావన్‌ ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనంతరం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

 Lady Fan Offered Gold To Hero Varun Dhavan Details,  Lady Fans, Bollywood, Hero,-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా వరుణ్ ధావన్ కి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ హీరో కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఆ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే… ఏదో పని నిమిత్తం హీరో వరుణ్ ధావన్ బయటకి వచ్చారు.అయితే ఈ హీరోని చూసిన ఎంతోమంది అభిమానులు అక్కడికి చేరుకొని ఆయనతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇలా వరుసగా తనతో ఫోటోలు దిగడంతో వరుణ్ కూడా ఎంతో ఓపికగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

Telugu Bollywood, Bollywoodvarun, Gold, Varun Dhavan, Ladyfan, Lady Fans, Varund

ఈ హీరోని చూసిన ఓ మహిళ అభిమాని అక్కడికి వచ్చి తన అభిమాన నటుడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.అయితే ఈమెతో మాట్లాడుతూ ఒకసారి మీరు నా బంగారం దుకాణాన్ని సందర్శించండి.మీకు బంగారం ఫ్రీగా ఇస్తాను అంటూ ఆఫర్ చేసింది.

ఈ మాట విన్న వరుణ్ ధావన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.ఇలా ఆ మహిళ అభిమాని చేసిన బంగారం ఆఫర్ ను ఆయన ఎంతో సున్నితంగా తిరస్కరించారు.

అయితే ఆ మహిళ మాట్లాడుతూ కేవలం మేకింగ్ చార్జెస్ మాత్రమే మినహాయిస్తాను బంగారం ఫ్రీగా ఇవ్వను అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube