అభిమాన హీరోకి బంగారం ఆఫర్ చేసిన లేడీ ఫ్యాన్... హీరో రియాక్షన్ ఇదే!

సాధారణంగా సినీ సెలబ్రిటీలకు ఎంతోమంది అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే వారి పై ఉన్న అభిమానాన్ని వివిధ రూపాలలో తెలియజేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో వరణ్‌ ధావన్‌ 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనంతరం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

సోషల్ మీడియాలో కూడా వరుణ్ ధావన్ కి విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ హీరో కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఆ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే.ఏదో పని నిమిత్తం హీరో వరుణ్ ధావన్ బయటకి వచ్చారు.

అయితే ఈ హీరోని చూసిన ఎంతోమంది అభిమానులు అక్కడికి చేరుకొని ఆయనతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇలా వరుసగా తనతో ఫోటోలు దిగడంతో వరుణ్ కూడా ఎంతో ఓపికగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

"""/" / ఈ హీరోని చూసిన ఓ మహిళ అభిమాని అక్కడికి వచ్చి తన అభిమాన నటుడితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అయితే ఈమెతో మాట్లాడుతూ ఒకసారి మీరు నా బంగారం దుకాణాన్ని సందర్శించండి.మీకు బంగారం ఫ్రీగా ఇస్తాను అంటూ ఆఫర్ చేసింది.

ఈ మాట విన్న వరుణ్ ధావన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.ఇలా ఆ మహిళ అభిమాని చేసిన బంగారం ఆఫర్ ను ఆయన ఎంతో సున్నితంగా తిరస్కరించారు.

అయితే ఆ మహిళ మాట్లాడుతూ కేవలం మేకింగ్ చార్జెస్ మాత్రమే మినహాయిస్తాను బంగారం ఫ్రీగా ఇవ్వను అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

తండేల్ తర్వాత స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నాగ చైతన్య