నకిలీ పత్తి విత్తనాలపై కొరవడిన నిఘా...సుమారు10 ఎకరాల్లో పంటనష్టం

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం( Peddavoora ) కుంకుడుచెట్టు తండా,పులగూడెంలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేపుతున్నాయి.వివరాల్లోకి వెళ్తే.

కుంకుడుచెట్టు తండాకు చెందిన రమావత్ రాజేష్ నాయక్,జగన్,పకీర, పాండ్యా,బెడదూరి వెంకటరెడ్డి అనే పెద్దవూర మండలానికి చెందిన నలుగురు రైతులు హాలియాలో కిసాన్ సీడ్స్ ఫర్టిలైజర్ ( Kisan Seeds Fertilizer )షాప్లో యూఎస్ ఆగ్రో సీడ్స్ కంపెనీ వారి 7067 అనే పత్తి విత్తనాలను తేదీ 03/06/2024న కొనుగోలు చేశారు.వాటి రసీదు వివరాలు 1931, 1930,1928 కొంతమంది రైతులు జూన్ నెలలోనే కొనుగోలు చేశారు.

పత్తి విత్తనాలు పూర్తిగా కల్తీ కావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు మనోవేదనకు గురయ్యారు.ఒక ఎకరాకు 15 క్వింటాల చొప్పున నష్టం వాటిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుంకుడు చెట్టు తండాలోనే సుమారుగా 10 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది.తమతోపాటు సాగు చేస్తున్న వారి పత్తి మాత్రం ఏపుగా పెరిగి,మంచికాత వచ్చి పంట కళకళలాడుతోందని రైతులు చెబుతున్నారు.

Advertisement

నకిలీ విత్తనాలపై నిఘా కరువవడంతో దళారుల నుంచి బెడద ఎకువైందని రైతులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కల్తీ విత్తనాల కంపెనీల యజమానుల క్రిమినల్ కేసులు నమోదు చేసి,నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మూసికి పూడిక ముప్పు
Advertisement

Latest Nalgonda News