ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒకచోట వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించే ఉంటారు.కాగా తాజాగా హైదరాబాద్ మహానగరంలోని కుషాయిగూడలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రాంతంలో ఉన్న ఓ కూలర్ల దుకాణంలో చెలరేగిన మంటలు క్రమంగా ఐదు దుకాణాలకు వ్యాపించాయి.దీంతో ఆ ఐదు షాపులు కూడా దగ్ధమయ్యాయని సమాచారం.
అదీగాక రోడ్డు పక్కన ఆగిఉన్న డీసీఎంకు కూడా మంటలు అంటుకున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని, కొందరు ఆకతాయిలు కావాలనే షాపులకు నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇక ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.కాగా ఈ ఘటనాస్థలాన్ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా దర్యాప్తూ ప్రారంభించారు.