గుడివాడ "మేమంతా సిద్ధం" సభలో కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!!

వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) బస్సు యాత్ర సోమవారం గుడివాడకు( Gudivada ) చేరుకోవడం జరిగింది.శనివారం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయం జరిగిన తర్వాత.

 Kodali Nani Key Remarks In The Gudivada Memanta Siddham Sabha Details, Kodali Na-TeluguStop.com

ఆరోజు రాత్రి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో  చికిత్స తీసుకుని ఆదివారం విశ్రాంతి తీసుకోవడం జరిగింది.అనంతరం సోమవారం బస్సు యాత్ర ప్రారంభమైంది.

ఈ క్రమంలో గుడివాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali Nani ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నుంచి వృద్ధుల వరకు.

ప్రజల అవసరాన్ని తీర్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో, వార్డులలో సచివాలయాలు ఏర్పాటు చేసి.

వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించాల్సిన ప్రతి సౌకర్యాన్ని.నేరుగా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా… ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు.

Telugu Chandrababu, Cmjagan, Kodali Nani, Memanta Siddham, Mla Kodali Nani, Vija

ఈ రకంగా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్.పాఠశాలల విద్యార్థులకు ప్రతి అవసరాన్ని కుటుంబ పెద్దగా తీర్చారు.అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదల ప్రాణాలను కాపాడారు.రాజకీయంగా వైఎస్ జగన్ నీ ఎదురుకోలేక చంద్రబాబు( Chandrababu ) ఓ మాయ కూటమి ఏర్పాటు చేశారు.అయితే కూటమి ఏర్పాటు చేసిన గాని సిద్ధం సభలకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక.రాజకీయంగా ఎదుర్కోలేక.

దాడులకు పాల్పడ్డారు.భౌతికంగా తొలగించాలని విజయవాడలో దాడి చేశారు.

కానీ భగవంతుని ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు వల్ల… ఎలాంటి ప్రమాదం జరగలేదు.మరో 50 రోజుల్లో కచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతారు.

మీ దమ్ము ధైర్యం.నిబద్ధత మేం దగ్గర నుండి చూసాం.

చెప్పిన మాటపై తూచా తప్పకుండా నిలబడే తత్వం మీది.గడిచిన ఐదేళ్లలో మీతో ఒక అబద్ధం కూడా చెప్పించలేకపోయాం.

అని కొడాలి నాని సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube