చమ్మక్ చంద్ర అన్నం పెట్టి మరీ పాతిక వేలు ఇచ్చాడన్న నటి.. ఈ కమెడియన్ గ్రేట్ అంటూ?

టాలీవుడ్ నటి వైజాగ్ జగదీశ్వరి( Vizag jagadeeswari ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఛాన్స్ ఇచ్చి తీసేసిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని ఆమె తెలిపారు.

 Vizag Jagadeeshwari Comments About Chammak Chandra Details, Vizag Jagadeeshwari,-TeluguStop.com

గోపీచంద్ భీమా సినిమాలో( Bhimaa Movie ) నాకు ఛాన్స్ ఇచ్చి షూట్ కు రమ్మన్నారని డైలాగ్ స్పీడ్ గా చెప్పమని డైరెక్టర్ కోరారని ఆమె చెప్పుకొచ్చారు.ఆ తర్వాత నన్ను తీసేశారని తెలిసిందని జగదీశ్వరి పేర్కొన్నారు.

నన్ను రిజెక్ట్ చేయడంతో ఏడ్చేశానని ఆమె తెలిపారు.

నా పాత్రకు బదులుగా షెర్లీ అనే నటి నటించిందని ఆమె పేర్కొన్నారు.

హైపర్ ఆది( Hyper Adi ) నాకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఛాన్స్ ఇప్పించారని ఒక్క ఎపిసోడ్ కు 10000 రూపాయల రెమ్యునరేషన్ వచ్చిందని ఆమె అన్నారు.ఇప్పుడు మల్లెమాల సంస్థ అందరికీ జీతాలు ఇస్తోందని ఆమె పేర్కొన్నారు.

ఒక్క ఎపిసోడ్ కు మాత్రం నాకు 15000 రూపాయల పారితోషికం వచ్చిందని జగదీశ్వరి వెల్లడించడం గమనార్హం.

జబర్దస్త్ కు( Jabardasth ) ఎవరూ పిలవడం లేదని శ్రీదేవి డ్రామా కంపెనీకి( Sridevi Drama Company ) మాత్రం అప్పుడప్పుడూ పిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు.హైపర్ ఆది మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారని జగదీశ్వరి అన్నారు.చమ్మక్ చంద్రతో( Chammak Chandra ) నేను రెండు ఎపిసోడ్లు చేశానని నన్ను మమ్మీ అని చంద్ర అని పిలుస్తారని ఆమె తెలిపారు.

నా ఇంటర్వ్యూ చూసి ఆర్థిక ఇబ్బందుల గురించి తెలిసి 25,000 సహాయం చేశాడని ఆమె పేర్కొన్నారు.

ఆ సమయంలో రెండు నెలలు నేను ఆర్థిక ఇబ్బందులు అధిగమించానని జగదీశ్వరి అన్నారు.5,000 రూపాయల పారితోషికం తీసుకునే వాళ్లకు రెగ్యులర్ గా ఆఫర్లు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.వైజాగ్ జగదీశ్వరి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

చమ్మక్ చంద్ర గ్రేట్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.రాబోయే రోజుల్లో ఈ నటికి మరిన్ని ఆఫర్లు పెరగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube