పట్టభద్రుల ఓటర్లలో టాప్ లో ఖమ్మం జిల్లా రిటర్నింగ్ అధికారిణి దాసరి హరిచందన

నల్లగొండ జిల్లా:నల్లగొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఓటర్లలో మొత్తం 12 జిల్లాలు ఉన్నాయని,అందులో ఖమ్మం జిల్లా( Khammam District ) అత్యధిక ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా, సిద్దిపేట అత్యల్ప ఓటర్లతో అట్టడగు స్థానంలో ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక( MLC by-election) రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 63 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని,పోటీలో ప్రస్తుతం 52 మంది అభ్యర్థులు ఉన్నారన్నారు.

ఎన్నికల ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ఆ జిల్లాలో తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు.అలాగే అభ్యర్థి ఎంతైనా ఖర్చు చేయవచ్చని,ఎలాంటి లిమిట్ లేదని,దానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలుపాలన్నారు.

ఇంటి గోడలకు పోస్టర్ వేయాలన్న ఆ ఇంటి ఓనర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.కారు,బైక్ ర్యాలీ తీయాలన్నా అనుమతులు తప్పనిసరి అన్నారు.

అలాగే 12 జిల్లాల్లో డిస్టిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని,స్వీప్ ద్వారా అవగాహన సదస్సులు కూడా చేస్తున్నట్లు తెలిపారు.ఎన్నికలకు సి-విజిల్,సాక్ష్యం యాప్ లు అందుబాటులో ఉంటాయన్నారు.

Advertisement

బ్యాలెట్ ప్రింటింగ్ కూడా ప్రారంభం అయ్యిందన్నారు.జిల్లాల వారీగా ఓటర్ల వివరాలను ప్రకటించారు.

నల్గొండలో 80,871,సూర్యాపేటలో 51,497,యాదాద్రిలో 34,080, ఖమ్మంలో 83,879,భద్రాద్రిలో 40,106,మహబూబాబాద్ లో 34,933,వరంగల్ లో 43,812, జయశంకర్ భూపాలపల్లిలో 12,535, ములుగులో 10,299,జనగామలో 23419, హన్మకొండలో 43,729, సిద్దిపేటలో 4679 ఓటర్లు,పట్టభద్రుల ఓటర్లు ఉన్నారన్నారు.పట్టభద్రుల ఓటర్లలో ఖమ్మం జిల్లా 83,879 మంది ఓటర్లతో టాప్ లో ఉందని,అత్యల్పంగా 4679 మంది పట్టభద్రుల ఓటర్లను కలిగి సిద్దిపేట జిల్లా ఉందని, అలాగే పోలింగ్ స్టేషన్లు కూడా సిద్దిపేటలో 5 మాత్రమే ఉన్నాయని,ఖమ్మంలో 188 ఉన్నాయన్నారు.

ఈ మూడు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రుల ఓటర్లు 4,63,839 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో ట్రాన్సజెండర్లు 5 గురు మాత్రమే ఉన్నారన్నారు.మొత్తంగా పోలింగ్ స్టేషన్లు 605 ఉన్నాయని,ఈ నెల 25 వ తేదీ వరకు ఈ మూడు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని వెల్లడించారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

Latest Nalgonda News