కేసీఆర్‌...మళ్ళీ గెలవాలంటే విఓఏల జీతాలు పెంచండి

నల్లగొండ జిల్లా: ఈ సంవత్సరం డిసెంబర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ గెలవాలనుకుంటే గత 31 రోజులుగా 49 డిగ్రీల ఎండల్లో కూడా ధైర్యంతో,చావుకు తెగించి, త్యాగనిరతితో సమ్మె చేస్తున్న విఓఏల జీతాలు తక్షణమే రూ.26 వేలు పెంచుతున్నట్లుగా జీవో విడుదల చేయాలని, ఎట్లాగూ ఓడిపోతాము ఎందుకనుకుంటే వారి సమ్మె పోరాటాన్ని పట్టించుకోవద్దని,రేపు కొత్తగా వచ్చేవాళ్ళు పట్టించుకుంటారని ప్రజా పోరాట సమితి (పిఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.

బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ ప్రధాన కూడలిలో 31 రోజులుగా సమ్మె చేస్తున్న విఓఏల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల వీఓఏల నాయకురాళ్ళు ఎదుళ్ళ లక్ష్మి,అద్దెల ఉమ, ఏడుకొండల వెంకటేశ్, అంతటి వినోద,కోనేటి సుష్మిత,ఉయ్యాల శోభ, వడ్డేపల్లి రాణి,వి.విజయ, సింగిరెడ్డి శోభారాణి, గుడిసె పద్మ,వి.

KCR In Order To Win Again Increase The Salaries Of VOAs,kcr, Voa Protest, Nalgon

రమాదేవి, బూరుగు జ్యోతి మరియు పీఆర్ పిఎస్ నాయకులు రాచమళ్ళ అయిలయ్య యాదవ్,ధూదిగామ గోపాల్,యామగాని వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News