టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దర్శకుడిగా 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, 100కు పైగా చిత్రాలను రూపొందించారు.
అంతే కాకుండా ఈయన ఎంతో మంది హీరోయిన్ లను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే.అలాగే హీరోయిన్స్ ని తెరపై రాఘవేంద్రరావు చూపించినంత అందంగా మరే దర్శకుడు కూడా చూపించలేడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలా దర్శకుడు రాఘవేంద్ర రావు పరిచయం చేసిన హీరోయిన్ లు స్టార్ హీరోయిన్ లుగా మారి వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన వారు ఎంతో మంది వున్నారు.
ఇది ఇలా ఉంటే దర్శకుడిగా 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ జర్నీ మొత్తాన్ని తాను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ అనే పుస్తకాన్ని రచించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ ఏడాది పుట్టినరోజు సందర్భంగా మే 23న ఈ పుస్తకాన్ని సెలబ్రిటీల సమక్షంలో కెఆర్‌ఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇక రాఘవేంద్ర రవు కెరీర్‌కు సంబంధించిన పుస్తకం అనగానే.
అందులో ఏముందో తెలుసుకోవాలనే తపన సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరికీ ఉంటుంది.ప్రస్తుతం ఈ పుస్తకం మార్కెట్‌లో ఉంది.
అయితే ఈ పుస్తకం ఖరీదు అక్షరాల 5000 రూపాయలు.
ఆ పుస్తకంలో రాఘవేంద్రరావు జీవితంలో కొన్ని కీలకమైన విషయాలను రాసుకున్నారు.ఆయన తీసిన కొన్ని చిత్రాలతోపాటు కొంతమంది వ్యక్తుల గురించి తెలిపారు.అలా అని ఇది పూర్తిగా ఆత్మకథ కూడా కాదు.
సగం పేజీలు ఫొటోలతో నింపేశారు.అయితే పుస్తకం కొని అందులో ఉన్న ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం అనుకునేవాళ్లంతా రేటు చూసి ఉలిక్కిపడుతున్నారు.
ఇంత ఖరీదైన పుస్తకం తెలుగు సాహితీ చరిత్రలోనే లేదేమో? అని కామెంట్లు చేస్తున్నారు.అసలే పుస్తక పఠనం అనేది తక్కువైన రోజులివి.
అందులోనూ సినిమా వాళ్ల పుస్తకాలంటే చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ ఉండవన్న టాక్ ఉంది.ఇలాంటి తరుణంలో పుస్తకం ఖరీదు 5 వేలు పెట్టడం పుస్తక ప్రియులకు కాస్త కష్టంగానే ఉంది.
ఇదే రేటు కొనసాగితే ఆ పుస్తకం వైపు చేసేవాళ్లు కూడా ఉండరు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.అందరికి అందుబాటులో ఉండే రేటు పెడితే ఆసక్తి చూపించేవారు కొని చదివే అవకాశం ఉంటుంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి రాఘవేంద్ర రావు ఆ పుస్తకం ఖరీదు తగ్గించి అందరికి అందుబాటులో ఉండే విధంగా చేస్తారా లేదా అన్నది చూడాలి మరి.