దేశవ్యాప్తం గా అనేక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) దగ్గర్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయటం, దానిలో హోం మంత్రి అమిత్ షా వంటి కీలక బీజేపీ( BJP ) నేతను చేర్చడంపై కాంగ్రెస్ విమర్శించింది .ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్న సమయం గాని ఇందులో ఖరారు చేసిన విధి విధానాలు కానీ కేవలం తమ రాజకీయ ప్రయోజనం కోసమే భాజపా ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టం అవుతుందని అందుకే తమ పార్టీ తరపు సబ్యుడ్ని ఈ కమిటీ నుంచి విరమించుకున్నామని కాంగ్రెస్ నేత రాహుల్( Rahul ) చెప్పుకొచ్చారు.
ఇది రాష్ట్రాల సమైక్య స్ఫూర్తికి విఘాతమేనని, రాష్ట్రాల హక్కులను కాలరాసి అధ్యక్షతరహ ఎన్నికల విధానాన్ని రూపొందించడం కోసమే భాజపా ఈ విధంగా ప్రయత్నిస్తుందంటూ ఆయన ఆరోపించారు.దేశ వ్యాప్తంగా కూడా అనేకమంది రాజకీయ పరిశీలకులు కూడా భాజపా ఎన్నికల ప్రయోజనం కోసమే ఈ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.ఎన్నికల ఖర్చు ఆదా చేయడం కోసమే నిర్ణయం అనుకున్నప్పటికీ ,దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమేనని 40 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న దేశానికి ఇది ఏమంత పెద్ద ఖర్చు కాదన్నది వీరి వాదన.
జమిలీ విధానం( Jamili ) ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రాల సమస్యలు పక్కకు పోయి దేశం ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయని, ఇది రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.ఇక పూర్తిగా అధ్యక్షుడిపై ఆధారపడే విధంగా ప్రజాస్వామ్యాన్ని నడిపించడానికి భాజపా ప్రయత్నిస్తుందని ఇది రాజ్యాంగబద్ధంగా కానీ నైతికంగా కానీ సరైనది కాదని దీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందంటూ ప్రతిపక్ష పార్టీల నేతలుకూడా వ్యాఖ్యానిస్తున్నారు.అయితే ఇంతవరకు తాను అనుకున్న ప్రతి విషయంలోనూ మొండిగానే ముందుకెళ్తున్న మోడీ సర్కార్ ఈ విషయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో వేచి చూడాలి