ఈటీవీలో 10 ఏళ్లుగా ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం నుండి ఇటీవల హైపర్ ఆది తప్పుకున్న విషయం తెల్సిందే.హైపర్ ఆది మధ్య లో ఒక సారి తప్పుకున్నాడు.
ఆ సమయంలో ఆది తిరిగి వచ్చాడు.తిరిగి వచ్చి కనీసం ఆరు నెలలు కూడా కాకుండానే మళ్లీ జబర్దస్త్ లో కనిపించకుండా ఆది వెళ్లి పోయాడు.
ప్రస్తుతం ఆది జబర్దస్త్ లో మాత్రమే కనిపించడం లేదు.శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఢీ డాన్స్ షో లో కనిపిస్తున్నాడు.
అంటే మల్లెమాల వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.అతి త్వరలోనే మళ్లీ హైపర్ ఆది మళ్లీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు.
కానీ మల్లెమాల వారు చెబుతున్న దాని ప్రకారం జబర్దస్త్ కార్యక్రమం లోకి మళ్లీ ఆది రాకపోవచ్చు.అంతే కాకుండా ఆయన త్వరలోనే మల్లెమాల వారు ఇతర షో ల్లో కూడా ఆది కనిపించక పోవచ్చు అంటున్నారు.
ఆది ఇప్పుడు సినిమా లతో బిజీగా ఉన్నాడు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఆది ధమాకా సినిమా లో నటించి మెప్పించాడు.
అందుకే ఇక నుండి వరుసగా సినిమా ఛాన్స్ లు ఆయనకు వస్తాయి అంటున్నారు.
ప్రస్తుతం ధమాకా సినిమా యొక్క సక్సెస్ ను ఆది ఎంజాయ్ చేస్తున్నాడు.పవన్ కళ్యాణ్ సినిమా ల్లో కూడా ఆది నటిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఆది వరుసగా షో లు చేయకుండా సినిమా లు చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు అంటున్నారు.
కానీ ఆయన అభిమానులు మాత్రం జబర్దస్త్ లో మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.ఆది స్థానం లో వచ్చిన సద్దాం టీమ్ బాగానే చేస్తుంది.కానీ ఇప్పటి వరకు వారికి ఆది టీమ్ స్థాయి లో స్టార్ డమ్ మాత్రం రావడం లేదు.ముందు ముందు అయినా ఆది మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ లో సందడి చేస్తాడేమో చూడాలి.