కౌశిక్ రెడ్డి దూకుడు బీఆర్ఎస్ కు చేటు తెస్తోందా ? 

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ( BRS MLA Padi Kaushik Reddy )వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

 Is Kaushik Reddy's Aggression Helping Brs, Brs, Bjp, Congress, Telangana Electio-TeluguStop.com

వాస్తవంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కోర్టుకు వెళ్ళింది బి ఆర్ ఎస్ పార్టీ.దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ ను కోర్టు ఆదేశించింది.

ఈ విషయంలో బీఆర్ఎస్ ( BRS )పై చేయి సాధించడం, కాంగ్రెస్ కు ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో అనూహ్యంగా కౌశిక్ రెడ్డి దూకుడు ప్రదర్శించడంతో,  బిఆర్ఎస్ కు దక్కాల్సిన క్రెడిట్ డైవర్ట్ అయిందనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లోనే కనపిస్తున్నాయి.ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఫలితంగా హైకోర్టు తీర్పు వ్యవహారం డైవర్ట్ అయిందని,  బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.

Telugu Arekapudi Gandi, Congress, Telangana-Politics

 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ముందుగా బీఆర్ఎస్ పార్టీలో మంచి జోష్ కనిపించింది .ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు మొదలుపెట్టింది.పార్టీ కేడర్ అంతా ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని , దీనికి సంబంధించి సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది.  కాంగ్రెస్( Congress ) ఫిరాయింపు రాజకీయాలకు త్వరలోనే హైకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తుందని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది.

ఇకనైనా కాంగ్రెస్ రాజకీయాలను వ్యతిరేకించాల్సిందిగా మేధావుల మద్దతును బీఆర్ఎస్ కోరింది.తాము ఎప్పుడు ఫిరాయింపులకు ప్రోత్సాహం ఇవ్వలేదని,  ఫిరాయింపులకు , విలీనంకు తేడా తెలుసుకోవాలని కాంగ్రెస్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ప్రకటనలు చేసింది.

Telugu Arekapudi Gandi, Congress, Telangana-Politics

ఈ స్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సమయంలో చీరలు , గాజులను పార్టీ ఆఫీస్ తీసుకువచ్చి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇస్తాను అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడంతో అసలు చర్చ పక్కదోవ పట్టిందని, కౌశిక్ రెడ్డి అతి ఉత్సాహంతో బీ ఆర్ ఎస్ కు  దక్కాల్సిన క్రెడిట్ డైవర్ట్ అయిందనే అభిప్రాయాలు బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube