ఆ ప్లేస్ షూ వేసుకోవడం అవసరమా.. శివజ్యోతి వీడియోకు ట్రోల్స్?

తీన్మార్ సావిత్రిగా శివ జ్యోతి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయమయ్యింది.తన తెలంగాణ యాసతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

 Is It Necessary To Wear That Place Shoe Trolls For Shivajyotis Video, Shivajyoth-TeluguStop.com

అలా ఆమెకు మంచి అభిమానం ఏర్పడటంతో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.అందులో తన ఆటపాటలతో మరింత పరిచయం పెంచుకుంది.

ఇక బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి బాగా మారిపోయిందని చెప్పాలి.ముఖ్యంగా తన డ్రెస్సింగ్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మంచి మంచి డ్రెస్సులను ధరించిన శివ జ్యోతి బయటికి వచ్చాక తన గ్లామర్ ను పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ గా తయారవుతూ అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది.

తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలిసి బాగా సందడి చేస్తూ ఉంటుంది.సమయం వచ్చిన్నప్పుడల్లా వారితో కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇక యూట్యూబ్లో ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో ఇప్పటికి చాలా వీడియోస్ పంచుకుంది.

చాలా వరకు నగలు కొన్నాను అంటూ, చీరలు కొంటున్నాను అంటూ వీడియోస్ బాగా పంచుకుంటుంది.

నిజానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు చాలా వరకు తనవి షాపింగ్ వీడియోస్ ఉంటాయి.ఇక ఆ వీడియోస్ చూసిన నెటిజన్స్ ఆమెను బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ఎప్పుడు షాపింగ్ లేనా అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇక ట్రిప్స్ కి వెళ్ళినా కూడా అక్కడ తీసిన వీడియోస్ కూడా బాగా పంచుకుంటూ సందడి చేస్తూ ఉంటుంది.తనతో పాటు తన భర్తను కూడా అందరికీ పరిచయం చేసింది శివ జ్యోతి.

ఇక అతడిని కూడా ఒక సెలబ్రిటీ చేసేసింది.అతడు కూడా బుల్లితెర పై పలు షో లలో శివజ్యోతి తో కలిసి బాగా సందడి చేస్తూ ఉంటాడు.

ఇక శివ జ్యోతి రీసెంట్ గా మరో ఛానెల్ క్రెయేట్ చేసుకొని అందులో ఊరి ముచ్చట్లు అని చాలా విషయాలు పంచుకుంటుంది.చాలా వరకు అందరికి తెలియని విషయాలు బాగా షేర్ చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తను తన భర్తతో కలిసి బ్యాంకాక్ వేకెషన్ కి వెళ్ళగా అక్కడ సరదాగా గడుపుతున్న వీడియో పంచుకుంది.అయితే అందులో తను ఫిష్ లతో ఇక ఇతర ప్లేస్ లలో తిరుగుతూ సందడి చేసింది.అయితే అందులో టెంపుల్ లాగా అనిపించిన ప్లేస్ లో తను షు వేసుకొని కనిపించింది.

ఇక ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.అంత స్వచ్ఛమైన ప్లేస్ లో అలా షు వేసుకొని షో చేయడం అవసరమా అంటూ ఫైర్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube