దిల్‌రాజు రెండవ పెళ్లి వార్తల్లో నిజమెంత?

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కొన్నాళ్ల క్రితం భార్యను కోల్పోయిన విషయం తెల్సిందే.దిల్‌రాజు నిర్మించే ప్రతి సినిమా కూడా ఆయన భార్య శ్రీమతి అనిత సమర్పించు అంటూ ఉంటుంది.

 Is Dil Raju Second Marriage Real-TeluguStop.com

భార్య అంటే అంతగా అభిమానం ఉన్న దిల్‌రాజు ఆమె చనిపోయిన తర్వాత రెండవ పెళ్లికి సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇటీవలే బిడ్డకు పెళ్లి చేసి తాత కూడా అయిన దిల్‌రాజు ఇప్పుడు తోడు కోసం రెండవ పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో దిల్‌రాజు అంటే చాలా గౌరవంగా చూస్తారు.ఆయన బ్యానర్‌లో సినిమాలు చేసేందుకు చిన్న హీరోల నుండి సీనియర్‌ హీరోల వరకు ఆసక్తి చూపిస్తారు.అలాంటిది ఇప్పుడు దిల్‌రాజు ఈ వయసులో పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే దిల్‌రాజు పెళ్లి చేసుకోబోతున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే ఒక వేళ పెళ్లి చేసుకుంటే అంతగా అవమానపడాల్సింది ఏముంది, తోడు కోసం పెళ్లి చేసుకుంటే పరువు ఎలా పోతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Telugu Dil Raju-Latest News - Telugu

దిల్‌రాజు రెండవ పెళ్లి వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు మీడియా వారు ప్రయత్నించారు.కాని వారు మాత్రం ఈ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.ప్రస్తుతానికి ఆ విషయమై మాట్లాడలేం అంటున్నారు.అంటే కుటుంబ సభ్యులు ప్రస్తుతం దిల్‌రాజును ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తాత అయినా కూడా మూడు నాలుగు పదుల వయసులో ఉన్న వ్యక్తిగానే దిల్‌రాజు కనిపిస్తాడు.అందుకే పెళ్లి చేసుకున్నా తప్పేం లేదని కొందరి అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube