న్యూయార్క్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న భారత సంతతి సీఈవో.. బైడెన్‌తో భేటీ

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు అక్కడ కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, సీఈవోలు, పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు.

 Indian-origin Ceo Sanjay Mehrotra Promises To Invest $100 Bn, Create 50,000 Jobs-TeluguStop.com

ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు.ఇప్పుడు అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన మైక్రో టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా.రానున్న 20 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.

తద్వారా వేలాది ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ మేరకు తన లింక్డ్ ఇన్ పోస్ట్‌లో తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశానని.తన కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను ఆయనకు వివరించినట్లు సంజయ్ చెప్పారు.

అమెరికాలోనే అతిపెద్ద సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సెంటర్‌‌‌ను ఏర్పాటు చేస్తానని ఆయన వివరించారు.

తమ కంపెనీ రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాలను సృష్టిస్తుందని… శ్రామికశక్తిని నిర్మించడానికి స్థానిక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటామని సంజయ్ చెప్పారు.

న్యూయార్క్ నగరాన్ని సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంజయ్ వెల్లడించారు.అలాగే గ్రీన్ చిప్స్ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో 250 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ మాట్లాడుతూ ప్రాజెక్ట్‌కు సంబంధించి 500 మిలియన్ల కమ్యూనిటీ ఫండ్ సాయంతో వర్క్‌ఫోర్స్, హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులతో ఈ ప్రాంతాన్ని దీర్ఘకాలికంగా నిలబెడుతుందని ఆకాంక్షించారు.

Telugu America, Greenchips, Indian Origin, Joe Biden, Kanpur, Kathy Hochul, York

ఇకపోతే.మైక్రాన్ వ్యవస్థాపకుడు సంజయ్ మెహ్రోత్రా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించారు.ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, 18 ఏళ్ల వయసులో అమెరికాకి వలస వెళ్లాడు.

బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో బీఏ, ఎంఏ డిగ్రీలను పొందారు.అనంతరం ఎగ్జిక్యూటివ్ బిజినెస్ డిగ్రీ కోసం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చేరారు.అనంతర కాలంలో బోయిస్ స్టేట్ యూనివర్సిటీ సంజయ్‌కి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube