దొడ్డిదారిన అగ్రరాజ్యంలోకి వెళ్లేందుకు అమెరికా – మెక్సికో సరిహద్దు వద్ద ట్రంప్ గోడ దూకేందుకు ప్రయత్నించి గతేడాది బ్రిజ్ కుమార్ అనే భారతీయుడు మరణించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అహ్మదాబాద్‌కు చెందిన ఒకరు, గాంధీ నగర్‌కు చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేయగా.ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఏడుగురు వ్యక్తులు .బ్రిజ్ కుమార్ యాదవ్, అతని భార్య పూజ, కుమారుడు తన్మయ్‌ని అక్రమంగా అమెరికాకు పంపేందుకు యత్నించాడు.అయితే అక్కడి ప్రతికూల పరిస్ధితులు , అక్రమంగా వెళ్లడం వల్ల కలిగే నష్టాల గురించి వారు అతనికి తెలియజేయలేదు.

ఈ ముఠా బ్రిజ్‌కుమార్‌తో పాటు అతని భార్యాబిడ్డలను గతేడాది నవంబర్ 11న ముంబైకి తీసుకెళ్లి.ఇస్తాంబుల్ మీదుగా మెక్సికోకు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలో డిసెంబర్ 21, 2022న ట్రంప్ వాల్ అని పిలిచే యూఎస్-మెక్సికో సరిహద్దులోని గోడను ఎక్కే ప్రయత్నంలో బ్రిజ్‌కుమార్ యాదవ్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
అయితే అతని భార్య, మూడేళ్ల కుమారుడికి ఈ ఘటనలో తీవ్రగాయాలయ్యాయి.ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రిజ్‌యాదవ్ , అతని కుటుంబం గాంధీనగర్ జిల్లాలోని కలోల్ తాలూకాలో నివసిస్తున్నారు.ముగ్గురు కుటుంబ సభ్యులు చాలా ఎత్తు నుంచి పడిపోయారని అమెరికన్ మీడియా కథనాలను ప్రచురించింది.యాదవ్ భార్య అమెరికా వైపు పడిపోగా.
వారి కుమారుడు మెక్సికో వైపు పడిపోయాడు.యాదవ్ మృతిపై కలోల్ తాలూకా పోలీస్ స్టేషన్‌లో మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది.

గతేడాది జనవరిలో అమెరికా – కెనడా సరిహద్దుల్లో గడ్డకట్టిన స్థితిలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు శవాలుగా తేలిన వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.మృతులను జగదీష్ పటేల్, అతని భార్య వైశాలి పటేల్, వారి పిల్లలు విహంగీ పటేల్, ధార్మిక్ పటేల్‌గా గుర్తించారు.వీరి మృతదేహాలు విన్నిపెగ్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో వున్న ఎమర్సన్‌కు తూర్పున మంచు కప్పబడిన పొలంలో కనిపించాయి.వీరు కూడా కలోల్ తహసీల్‌కు చెందిన వారే కావడం గమనార్హం.
ఆ తర్వాత మార్చి 2022లో కెనడా సరిహద్దుకు సమీపంలో వున్న సెయింట్ రెగిస్ నదిలో పడవ మునిగిన ఘటనలో గుజరాత్‌కు చెందిన ఆరుగురు యువకులను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు.వీరంతా యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.