విశాఖలో ముగిసిన భారత్, జపాన్ నౌక దళ విన్యాసాలు

విశాఖపట్నం లో జిమెక్స్‌ 22 నౌకా విన్యాసాలు భారత్‌, జపాన్‌ నౌకాదళాలు సంయుక్తంగా భారత నావికా దళం నిర్వహించింది.భారత్, జపాన్ల మధ్య నౌక విభాగంలో మంచి అనుబంధాలు ఉన్నాయి.

 Indian And Japanese Naval Exercises Concluded In Visakhapatnam , Submarine,india-TeluguStop.com

ఈ విన్యాసాలు రెండు దేశాల మధ్య జరిగిన నౌక దళ విన్యాసాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా విన్యాసాలను రెండు దేశాలు పూర్తి చేశాయి.

రెండు దేశాల నౌక దళ అధికారులు వీడ్కోలు పలుకుతూ తమ తమ దేశాల కు వెళ్ళిపోయారు.

ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా నేతృత్వంలోని భారత నౌకాదళ విన్యాసాలు జరిగాయి.కమాండర్ హిరాటా తోషియుకి నేతృత్వంలో జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ షిప్‌లు ఇజుమో, తకనామి వారం రోజుల పాటు విన్యాసాల్లో పనిచేసాయి.

రెండు దేశాల నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన జిమెక్స్‌ 22 పలు క్లిష్టమైన విన్యాసాలను నిర్వహించారు.

అంతటి క్లిష్టమైన విన్యాసాలను భారత్, జపాన్ కు చెందిన నౌకాదళ అధికారులు ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఎంతో చాకచక్యంగా ఈ విన్యాసాలను పూర్తి చేశారు.

ఈ నౌకాదళ విన్యాసాలు రెండు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర అవగాహన, పరస్పర చర్యను ఏకీకృతం చేసిందని చెప్పాలి.గాలి మరియు ఉపరితలంపై ఈ రెండు దేశాల నౌకల దళ అధికారులు దృష్టి పెట్టారు.

Telugu India, Indian Japanese, Izumo, Japan, Jimex Maneuvers, Naval Exercises, S

భారత నౌకాదళానికి చెందిన మూడు స్వదేశీయంగా నిర్మించిన యుద్ధనౌకలు సహ్యాద్రి, స్టెల్త్ ఫ్రిగేట్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కార్వెట్‌లు కడ్మట్, కవరత్తి అనే నౌకలు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి.వీటి తో పాటు గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ రణ్‌విజయ్, ఫ్లీట్ ట్యాంకర్ జ్యోతి, సబ్‌మెరైన్లు, ఎంఐజీ 29 కే ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, పలు నౌకలు కూడా ఈ విన్యాసాల కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube