అక్రమ అరెస్టులతో అంగన్వాడీ పోరాటాలను ఆపలేరు: సీఐటీయూ నాయకులు

సూర్యాపేట జిల్లా:అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరని సిఐటీయూ నాయకులు అన్నారు.ప్రజా భవన్ ముట్టడికి తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లు,వర్కర్ల సంఘం,సీఐటీయూ సంయుక్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి వెళ్లకుండా అంగన్‌వాడీ కార్యకర్తలను పెన్ పహాడ్ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కన్వీనర్ బొలిశెట్టి భాస్కరమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్‌వాడీ వర్కర్లకు వేతనాన్ని రూ.20 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని,మంత్రి సీతక్క సైతం రూ.18 వేలు చేస్తామని అసెంబ్లీలో చెప్పారన్నారు.అయినా నేటి వరకు పెంచకపోవడం దుర్మార్గమన్నారు.

అరెస్టు అయిన వారిలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగు కృష్ణ,అంగన్‌వాడీ టీచర్ షేక్ జానీబేగం, ఊర్మిళ,వెంకటమ్మ,విజయ, సుజాత తదితరులు ఉన్నారు.

Illegal Arrests Cannot Stop Anganwadi Struggles CITU Leaders, Illegal Arrests ,

Latest Suryapet News