Studying Abroad : విదేశాల్లో సరదాగా చదువుకోవచ్చు అనుకుంటున్నారా.. ముందు ఈ ట్వీట్ చూడండి..

విదేశాల్లో చదవడం చాలా ఫన్‌గా ఉంటుందని చాలా మంది అనుకుంటారు.కానీ అందరూ అనుకున్నట్లు అక్కడ పరిస్థితి అద్భుతంగా ఏమీ ఉండదు.

 If You Want To Have Fun Studying Abroad See This Tweet-TeluguStop.com

వీరు స్వదేశాల్లో చదివే వారి కంటే ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తుంది.తాజాగా ఓ భారతీయ విద్యార్థి చేసిన ట్వీట్‌తో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్( International students ) కష్టాల గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

విద్యార్థి తాను పాత్రలు కడుగుతున్న ఫోటోను షేర్ చేస్తూ విదేశాల్లో చదువుకోవడం అనేది తరచుగా అనుకున్నంత ఆకర్షణీయంగా ఉండదని సూచించింది.ఈ ట్వీట్ త్వరగా వైరల్ అయింది, దీనిపై అనేక కామెంట్స్ వచ్చాయి.

చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఆన్‌లైన్ సంభాషణలో పాల్గొన్నారు.ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇంటి పనులు చేయడమనేది స్వతంత్రంగా ఉండటంలో ఒక భాగమని కొందరు సూచించారు.పాత్రలు కడగడం వంటి పనులు ప్రతి ఒక్కరికీ తప్పవని, అలాంటి పనిని చేయడానికి ఇతరులపై ఆధారపడటం కుదరదని వారు నొక్కి చెప్పారు.మరికొందరు ఈ ట్వీట్‌లో హాస్యాన్ని కనుగొన్నారు, కొంతమంది విద్యార్థులు( students ) ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే పనులు చేయవలసిన అవసరాన్ని గుర్తిస్తారు.

విదేశాలకు వెళ్లే ముందు ప్రాథమిక జీవన నైపుణ్యాలను( Basic life skills ) నేర్చుకోవడం అవసరం ఉందని మరికొందరు అన్నారు, ఎందుకంటే మరొక దేశంలో చదువుకోవడం హాలిడే ఎంజాయ్ చేసినట్లు ఉండదు.

కొంతమంది వినియోగదారులు డిష్‌వాషర్‌ను ఉపయోగించడం వంటి సింపుల్ సొల్యూషన్స్ సూచించారు, డిష్‌వాషర్‌ను ఎలా ఉపయోగించాలో తెలియదా అని ఈ విద్యార్థిని కొందరు ఆటపట్టించారు.కొంతమంది పాత్రలు కడగడం ఆహ్లాదకరమైన పని అని అన్నారు.ఈ ట్వీట్‌కి 5 లక్షల దాక వ్యూస్ వచ్చాయి.

ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తూనే ఉన్నాయి.చాలామంది అబ్రాడి స్టడీ కష్టమే అని ఒప్పుకుంటూ ఈ ఇండియన్ విద్యార్థి ట్వీట్‌ను లైక్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube