బంగారం అంటే భారతీయులకు ఎంత ప్రత్యేకమైనదో వేరే చెప్పాల్సిన పనిలేదు.ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరి ఇంటిలో వారి స్థాయికి తగ్గట్టు కనీసం తక్కువలో తక్కువ 10 తులాల బంగారం వరకు నిలువ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ఇక్కడ మహిళలు బంగారం వస్తువు లేనిదే ఇంటినుండి కాలు బయటకి పెట్టారు అంటే నమ్మి తీరాలి.అందుకే దేశంలో బంగారం డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.
అదే బంగారం వారికి అవసరమైనపుడు డబ్బు రూపంలో వారికి సహకరిస్తుంది.ఇక్కడ చాలామందికి ఏదన్నా అవసరం వచ్చినపుడు వెంటనే బంగారం తనఖా పెట్టాలనే ఆలోచన వచ్చేస్తుంది.
ఎందుకంటే, బంగారం తనఖా పెడితే లోన్ సులభంగా వస్తుందనేది వారు నమ్మకం కాబట్టి.అయితే దీని వలన చాలా బెనిఫిట్ ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.అవును, పర్సనల్ లోన్ కాకుండా గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.ప్రస్తుతం టెక్నాలజీ సాయంతో గోల్డ్ లోన్స్‌ను గంట వ్యవధిలోనే ఇచ్చేస్తున్నారు.
అంటే అత్యవసరం అయినపుడు చాలా త్వరితగతిన వేగంగా లోన్ తీసుకోవచ్చు.ఇతర రుణాలతో పోలిస్తే.
ఇది చాలా బెస్ట్ అడ్వాంటేజ్ అని అర్ధం చేసుకోవచ్చు.
ఇక్కడ గోల్డ్ లోన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది.బంగారాన్ని సదరు బ్యాంక్ కి తీసుకువెలితే చాలు.బ్యాంక్ అధికారులు సులభంగా లోన్ మంజూరు చేసేస్తారు.
మీ ఫోటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి డాక్యుమెంటలు ఇస్తే ఇక్కడ సరిపోతుంది.అంతేకాకుండా, అధిక లోన్ టు వాల్యూ రేషియో కూడా ఇక్కడ లభిస్తుంది.
అంటే మీ బంగారానికి గరిష్ట విలువను లోన్ రూపంలో పొందొచ్చు.అందువల్ల ఎక్కువ బంగారం ఉంటే ఎక్కువ లోన్ వస్తుందన్నమాట.
ఇక్కడ ముఖ్యంగా మరో బెనిఫిట్ ఉంది.అదే తక్కువ వడ్డీ రేట్లు.
గోల్డ్ లోన్‌పై ఇతర రుణాల కన్నా వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.