హైదరాబాద్ : భరత్ లో అతి గొప్ప నగరం

భారతదేశంలో గొప్ప నగరాలు ఏవని అడిగితే అందరూ డిల్లీ, ముంబై, కోల్ కత, చెన్నై, పూణే, చండీఘడ్ అంటూ గడగడ లిస్టు చదివేసి వాటిలో చివరిగా హైదరాబాద్ పేరు చెపుతుంటారు.కానీ దేశంలో నెంబర్ :1 స్థానంలో హైదరాబాద్ నిలిచింది.పైన పేర్కొన్న నగారాలన్నీ ఆ లిస్టులో చాలా వెనుకబడున్నాయని మెర్సర్ అనే అంతర్జాతీయ సంస్థ తన తాజా నివేదికలో ప్రకటించింది.ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 230 నగరాలను సర్వే చేసి వాటిలో నాణ్యమయిన జీవనానికి అత్యంత అనువుగా ఉన్న నగరాల జాబితాను తయారు చేసింది.

 Hyderabad Ranks Highest Among Indian Cities-TeluguStop.com

వాటిలో హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్: 1 స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో 138వ స్థానాన్ని దక్కించుకొంది.అంతర్జాతీయ స్థాయిలో పూణే-144, బెంగళూరు-145, చెన్నై-150, ముంబై-152, కోల్ కతా-160, డిల్లీ-161వ స్థానాలు దక్కించుకొన్నాయి.

ఇక విదేశాలలోని నగరాలలో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొట్టమొదటి స్థానంలో నిలిచింది.ఆ తరువాత వరుసగా స్విట్జర్ ల్యాండ్ లోని జ్యూరిచ్, న్యూజిల్యాండ్ లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వెంకోవర్ నగరాలు నిలిచాయి.

ఈ జాబితాలో సింగపూర్-26, మలేషియా రాజధాని కౌలాలంపూర్- 84, చైనా రాజధాని బీజింగ్-118, శ్రీలంక రాజధాని కొలంబో-132 స్థానాలలో నిలిచాయి.ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం ఈ జాబితాలో చిట్ట చివరి స్థానంలో అంటే నెంబర్: 280లో నిలిచింది.ఈ జాబితాను పరిశీలించినట్లయితే భారత్ లో ఏ నగరం కన్నా గత మూడు,నాలుగు దశాబ్దాలుగా ఎల్.టి.టి.ఈ.ఉగ్రవాదులతో వేగిన శ్రీలంకలో కొలంబో మిన్నగా ఉందని అర్ధమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube