నేడు ఆపిల్ ఐఫోన్లకు వున్న డిమాండ్ మరేవాటికి లేదంటే అతిశయోక్తి కాదేమో.అయితే ధరల విషయంలోనే వినియోగదారులు ఇతర కంపెనీల వైపు మరలుతారు.
అయితే కొంతమంది ఎంత ఖరీదైనా ఆపిల్ ఐఫోన్లను కొనేందుకే ఆసక్తి చూపిస్తుంటారు.అలా ఐఫోన్ వాడినవారు ఐఫోన్ 13 మోడల్ 2022 గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు.
ఎందుకంటే గత ఏడాదిలో వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ గా దానిని చెప్పుకుంటారు.దాంతో ఐఫోన్ 13 సేల్స్ భారీగానే పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మీరు కూడా ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 మోడల్ కొని ఉంటే, తమ డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.Android నుంచి కొత్త iPhoneకి ఒక ట్యాప్‌తో డేటా మైగ్రేషన్‌ను అనుమతిస్తుంది.
యూజర్లు ఫొటోలు, వీడియోలు, WhatsApp డేటాను కూడా దీనితో సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.అయితే ఇక్కడ డేటా వరకూ ఓకే గాని WhatsApp కాల్ హిస్టరీని మాత్రం ట్రాన్స్‌ఫర్ చేయలేరని గుర్తు పెట్టుకోవాలి.
WhatsApp డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలంటే సేమ్ ఫోన్ నంబర్‌ను ఉపయోగించాలి.
మీ పాత ఫోన్ మరియు కొత్త ఐఫోన్ రెండు కూడా తప్పనిసరిగా పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేయాలి.అలాగే మీ రెండు డివైజ్‌లు Android కొత్త iPhone ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసి ఉండాలి.Move to iOS యాప్‌ని ఓపెన్ చేసిన తరువాత ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను ఫాలో కావాలి.
డేటా ట్రాన్స్‌ఫర్ అడిగినప్పుడు, Android నుంచి Data Transfer ఆప్షన్‌పై Tap చేస్తే సరిపోతుంది.Transfer ఆప్షన్ నుంచి మీ WhatsApp డేటాతో సహా Transfer చేయాలనుకునే డేటాను ఇపుడు ఎంచుకోండి.
మీ Android ఫోన్‌లో START నొక్కిన తరువాత Export కోసం డేటాను రెడీ చేయడానికి WhatsApp కొంత సమయం పడుతుంది.డేటా రెడీ అయిన తర్వాత మీరు మీ Android ఫోన్ నుంచి Sign Out చేయవచ్చు.