ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu ) ఇటీవల అవినీతి ఆరోపణలపై రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో( AP Skill Development Scam ) ఆయన రాజమండ్రి జైలుకు వెళ్ళగా అక్కడ అతనికి 7691 అనే రిమాండ్ ఖైదీ నంబర్ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడికి స్పెషల్ కేటగిరీ క్లాస్ కింద వసతులు కల్పించాలని అవినీతి నిరోధక శాఖ రాజమండ్రి జైలు అధికారులకు సూచించింది.అయితే అతనికి ఖైదీ నంబర్ 7691 ఎలా ఇచ్చారు? ఇతరులకు ఎలా ఈ నంబర్లు కేటాయిస్తారు? అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది.దానికి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం.
అధికారులు ఖైదీలను 4 రకాలుగా వర్గీకరించారు: రిమాండ్ ఖైదీలు, కన్విక్టెడ్ ప్రిజనర్స్, డిటైనీ ప్రిజనర్స్, మహిళా ఖైదీలు.రిమాండ్ ఖైదీలు( Remand Prisoner ) అంటే అరెస్టయి విచారణ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు.కన్విక్టెడ్ ప్రిజనర్స్( Convicted Prisoners ) అంటే నేరానికి పాల్పడి జైలు శిక్ష పడిన వ్యక్తులు.
నిర్బంధ ఖైదీలు అంటే ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనల వంటి నేరారోపణ కాకుండా ఇతర కారణాల వల్ల అరెస్టు చేయబడి జైలులో ఉన్న వ్యక్తులు.మరోమాటలో డిటైనీ ప్రిజనర్స్ అంటే నేరారోపణ కాకుండా ఇతర కారణాల వల్ల కలెక్టర్, ఆర్‌డిఓ లేదా తహసీల్దార్ చేత అరెస్టు చేయబడి జైలులో ఉన్నవారు.
ఉమెన్ ప్రిజనర్స్ అంటే మహిళా ఖైదీలు.
ప్రతి ఖైదీకి వారి కేటగిరీ, వారిని జైలులో చేర్చిన క్రమం ఆధారంగా ఒక నంబర్ కేటాయించబడుతుంది.అయితే కన్విక్టెడ్ ఖైదీలకు “C.P”తో మొదలయ్యే ఖైదీ నంబర్‌లు కేటాయించబడతాయి.తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డీఐజీ ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.చంద్రబాబు నాయుడుకు జైల్లోకి వస్తున్న రిమాండ్ ఖైదీల సీరియల్ నెంబర్ ప్రకారం 7691 నంబర్ కేటాయించారు, అంటే జైలు ఓపెన్ చేసిన నాటి నుంచి జైలులో చేరిన 7691వ రిమాండ్ ఖైదీ చంద్రబాబు నాయుడు.
ఈ సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత లేదు.ఇది కేవలం యాదృచ్చిక విషయం.