గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై గుత్తా సంచలన కామెంట్స్

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కృష్ణా బేసిన్ లో గల జిల్లా సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురికావడానికి గత ప్రభుత్వమే కారణమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) సంచలన కామెంట్స్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని తన క్యాంపు ఆఫీస్ నందు గురువారం ఆయన మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు.

గోదావరి పైన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి,కృష్ణా బేసిన్ లో నిర్మించే ప్రాజెక్టులపై అశ్రద్ధ చేశారన్నారు.గత ప్రభుత్వం కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ కృష్ణా బేసిన్‌( Krishna Basin )పై చూపలేదని మండిపడ్డారు.

Gutha Sukender Reddy Sensational Comments On Govt, Gutha Sukender Reddy, Nalgon

మూసీ రివర్‌ ఫ్రంట్ ఏర్పాటు మంచి పరిణామమని,సుంకిశాల అవసరం లేని సాగునీటి పథకమని,దానిని తాను గతంలోనే వ్యతిరేకించానని గుర్తు చేశారు.ఆనాడు సుంకిశాల కోసం పెట్టిన ఖర్చు ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టుకు పెట్టి ఉంటే నల్గొండ జిల్లా రైతులకు,ప్రజలకు మేలు జరిగేదన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరగా పూర్తి చేసి, జిల్లాను సస్యశ్యామలం చెయ్యాలని అభిప్రాయపడ్డారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

Latest Nalgonda News