గుట్టపై గుక్కెడు నీళ్లు లేక భక్తుల అవస్థలు

యాదాద్రి జిల్లా:ప్రపంచమే అబ్బురపడేలా పునర్నిర్మాణం చేసుకొని,పున:ప్రారంభమై వారం రోజులు కూడా కాకుండానే యాదగిరిగుట్టపైన రోజుకొక వివాదం వెలుగుచూస్తుంది.

ఆదివారం ఆలయాన్ని దర్శించుకోడానికి గుట్టపైకి వచ్చిన భక్తులకు మంచినీళ్లు లేక నానా ఇబ్బందులు పడ్డారు.

ఒకవైపు భానుడు భగభగలతో వేసవి తాపాన్ని చూపుతుంటే,గొంతు తడుపుకోడానికి మంచినీళ్లు లేకపోవడంతో పసి పిల్లలతో వచ్చిన వారు,పిల్లల దాహార్తి తీర్చే దారిలేక కన్నీరు పెట్టుకున్నారుగుట్టపై ఇలంటి పరిస్థితి ఉంటే ఆలయ ఈవో కనీసం ఈ సమస్యలపై దృష్టి పెట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.యాదాద్రిని ఎంత అభివృద్ధి చేస్తే ఏం లాభం,భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించనిది అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Gukkedu Waters On The Hill Or The Conditions Of The Devotees-గుట్టప�

అన్ని వేల కోట్లు పెట్టి నిర్మాణం చేసిన వారికి మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఆలోచన లేదా అని ప్రశ్నించారు.

పన్ను కట్టలేక ఏకంగా జైలుకి వెళ్లిన పవన్ కళ్యాణ్ పెదనాన్న..!
Advertisement

Latest Nalgonda News