రెండేళ్లైనా పూర్తికాని వంతెన...గ్రావెలింగ్,బిటీ పనులు పెండింగ్

నల్గొండ జిల్లా:పెద్దవూర మండల కేంద్రంలో కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారి చిన్న వాగుపై ఉన్న నిజాం కాలం నాటి పాత వంతెన పక్కన రోడ్డు విస్తరణలో భాగంగా నూతన వంతెన ఏర్పాటు చేస్తున్నారు.రెండేళ్ల కిందట రూ.

50 లక్షల వ్యయంతో చేపట్టిన వంతెన నేటికీ పూర్తికాకుండా వంతెనపై రెండు వైపులా గ్రావెలింగ్, బిటీ పనులు అలాగే పెండింగ్లో ఉంచారు.ఇంకా 40 శాతం పనులు అసంపూర్తిగా వదలి వేయడంతో నాగార్జున సాగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై వంతెన ప్రాంతంలోని గతుకుల్లో ప్రయాణం చేయలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అలాగే కోదాడ-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పెద్దవూర మండల కేంద్రంలో ఒక కిలోమీటర్ దూరం రోడ్డు పనులు నిలిపి వేశారు.ఈ పెండింగ్ పనుల విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.

వేసవి కాలం కూడా పూర్తి కావొస్తుంది.ఈ లోగా వర్షాలు కూడా మొదలయ్యాయి,ఈ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని స్థానికులు,వాహనదారులు వాపోతున్నారు.

Advertisement

వర్షాకాల సీజన్ ప్రారంభమయ్యే నాటికైనా ఈ వంతెన వద్ద పనులు,రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయించి రాకపోకలు మెరుగుపడేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని,ప్రజా ప్రతినిధులను మండల ప్రజలు,వాహనదారులు కోరుతున్నారు.

దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు
Advertisement

Latest Nalgonda News