ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త.ఎప్పటినుంచో దిగ్గజ సెర్చింజన్ గూగుల్ చెబుతూ వస్తున్న తన ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌కు లేటెస్ట్ అప్‌డేట్‌ను త్వరలో తీసుకు రాబోతున్నట్టు తాజాగా ప్రకటించింది.
కాకపోతే ఎప్పటిలాగే దానికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పడం గమనార్హం.ఈ కంపెనీ ఆండ్రాయిడ్ 12 ను విడుదల చేసిన కొద్ది కాలం తర్వాత Android 13 ను లాంచ్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఆండ్రాయిడ్ 13 విడుదలైన సరిగ్గా 2 నెలల తర్వాత ఆండ్రాయిడ్ గో కొత్త వెర్షన్‌ను కంపెనీ ప్రకటించింది.
‘Android 13 (Go ఎడిషన్)’ ఆపరేటింగ్ సిస్టమ్ సరికొత్త అప్‌డేట్‌లతో తీసుకు రానుంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల కోసం తక్కువ మెమరీని తీసుకుంటుంది.అలాగే క్రమం తప్పకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు అందుతాయని కూడా ఈ కంపెనీ తెలిపింది.
ఈ అప్డేట్ తో వాల్ పేపర్, థీమ్స్ సెట్టింగ్స్, నోటిఫికేషన్ బార్ మొదలగునవి సరికొత్త డిజైన్లతో రానున్నాయి.అలాగే గూగుల్ ‘డిస్కవర్’ ఫీచర్ కూడా రాబోతోంది.
ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) 2023లో అవుట్-ఆఫ్-బాక్స్ డివైజ్‌లతో లాంచ్ అవుతుందని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది.
ఇకపోతే ఆండ్రాయిడ్ 13లో విభిన్నమైన కలర్ స్కీమ్స్ అనేవి ఉండబోతున్నాయి.వీటిని సెలెక్ట్ చేసుకుంటే ఓఎస్ నుంచి వాల్‌పేపర్స్, స్టైల్ వరకు ఆ కలర్ థీమ్ కిందకి మారిపోతాయి.మొబైల్ డిఫరెంట్ లుక్ లోకి వస్తుంది.
గూగుల్ యాప్స్‌కే కాకుండా ఇతర యాప్స్ ఐకాన్‌లకు కూడా కలర్ థీమ్స్ అప్లై చేసే ఫీచర్ ఆండ్రాయిడ్ 13లో అందుబాటులో ఉంటుంది.సెట్టింగ్స్‌లో థీమ్డ్ ఐకాన్స్‌ను ఆన్ చేసుకుంటే.
సపోర్ట్ చేసే యాప్స్ ఐకాన్ల కలర్ లుక్ కూడా మారిపోతుంది.కాబట్టి యూజర్లు తమకి నచ్చినట్టు వాడుకోవచ్చు.